పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

368 పాలుమాలి వానికి పనిసేయఁ గాకా చ. కొలఁ దెఱిఁగి బోధించ గురుఁడే యెఱుఁగుఁ గాక యిల దేహి యేమెఱుఁగు హీనశక్తుఁడు బలిమి శ్రీ వేంకటేశు పరతంత్రుఁడు దాను చలపట్టి యాతనికి శరణనుఁ గాక రేకు : 0017-01 ఆహిరి సంపుటము: 01-101 పల్లవి: ఏఁటికి దలఁకెద రిందరును గాఁటపు సిరులివి కానరో ప్రజలు చ. ఎండలఁ బొరలక యేచిన చలిలో నుండక చరిలోనుడుకక అండనున్న హరి నాత్మఁదలఁచిన పండిన పసిఁడే బ్రతుకరో ప్రజలు చ. అడవుల నలియక ఆకునలముఁదిని కడుపులు గాలఁగఁ గరఁగక బడి బడి లక్షిపతికి దాసులై పొడవగు పదవులఁ బొందరో ప్రజలు చ. పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ దిక్కులనంతటఁ దిరుగక గక్కన తిరువేంకటగిరిపతిఁ గని వొక్క మనసుతో నుండరొ ప్రజలు పె.అ.రేకు:0012-04 గుజ్జరి సంపుటము: 15-065 పల్లవి: ఏఁటికి నీ కితరమార్గములు యేల తవ్వెదవు చిత్తమా యీటునఁ బ్రయాసపడి నీ వంతకంటే మరి తెచ్చేవా చ. నానావిధు లేటికీ మును నారదాదు లెఱిఁగిన తెరువు చాలదా తూనుచఁ బొయ్యెదవు మతములు తొలుత శుకుఁడువోయినలోకంబులు చాలదా మానక చదువులె వెదకెదవు మరి ప్రపదుఁడు కన్నగతి చాలదా కానక కర్మములే చూచెదవు గజేంద్రుబడుకది చాలదా చ. ఇంకానీ వెఱుఁగవా ఈతఁడు లక్షీకాంతుఁడు యుత్రనిఁగోరిలుచుట చాలదా శంకలు యింకా నేటికి శరణాగతబిరు దితనిది యీతనిఁగొలుచుట చాలదా పారెoకపు సృష్టికి మూలపు బ్రహ్మను బొడ్డునఁ బుట్టించె నితఁడూ అంకెల శ్రీవేంకటేశ్వరుఁ డీతఁడు అనాది వైకుంఠంబిఁది చాలదా రేకు: 0032-01 పాడి సంపుటము: 01-195 పల్లవి: ఏఁటికి నెవ్వరిపాందు యిస్పిరో చీచీ నాటకములాల చీచీ నమ్మితిఁగా మిమ్మును చ. జవ్వనమదము చీచీ చక్కదనమరో చీచీ రవ్వెనరాజసగర్వమరో చీచీ క్వోనమదము చీచీ కూరిమియాసరో చీచీ నవ్వులదేహము చీచీ నమ్మితిఁగా మిమ్మును చ. ముచ్చటమమత చీచీ ముచ్చుమురిపెము చీచీ బచ్పురపణములోనిబచ్చన చీచీ తెచ్చుకోలుతాలిములదిట్టతనమరో చీచీ పుచ్చినపోకరో చీచీ పోయఁగా మీకాలము చ. సిరులచీఁకటి చీచీ సిలుగుసంపద చీచీ వరవిభవము చీచీ వాసిరో చీచీ కరుణించెఁ దిరువేంకటగిరిపతి నన్ను