పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

367 వెనకముందర చూడ వెరపయిన బ్రదుకు చ. తెగి చేఁదె తీపంు తినియేటి బ్రదుకు పగవారిపంచలపాలైన బ్రదుకు తగువేంకటేశ్వరుఁ దలఁచని బ్రదుకు పాంగకు నోపక మంటఁ బొగిలేటి బ్రదుకు రేకు:0297-01 నారాయణి సంపుటము: 03-560 పల్లవి: ఏఁటి విచారము యొక్కడి యాచారము మాటున జీవుఁ డింతేసి మాయలఁ బొరలును చ. పరగ నూరేండ్ల బ్రతుకునకేకా ధర నన్నియునుఁ గూర్చి దాఁచుకొనేది పొరసి నానాసుఖభోగాలు చింతించుఁ గాని పరమున కీపాటి ప్రయాసపడఁడు చ. కడుపు నించుకొరకుఁ గామసుఖమునకేకా చెడని వుద్యోగాలు సేయఁ గోరును మిడిసి లోకములెల్ల మెప్పించ నడచుఁ గాని చిడుముడి హరి మెప్పించే ననలేఁడు చ. సారెసారెఁ జచ్చిచచ్చి జననము నొందేదెల్లా వూరఁగల కర్మము లొగిఁ జేయుట మేరలేక నరులను మెచ్చుగఁ గొలుచుఁ గాని కూరిమి శ్రీవేంకటేశుఁ గొలువఁగ లేఁడు రేకు:0013-01 గుండక్రియ సంపుటము: 01-077 పల్లవి: ఏఁటి విజ్ఞాన మేఁటి చదువు గూఁటఁబడి వెడలుగతిగురుతు గనలేఁడు చ. ఏడుమడుకలచర్మ మింతయునుఁ దూంట్లే గాడఁబెట్టుచుఁజీము గారఁగాను டெ పాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణి వీడఁదన్ను కచనెడి వెరవు గనలేఁడు చ. కడుపునిండిన మహాకష్టంబు నలుగడల వెడలుచును బెనుమురుకి వేయఁగాను యిడుమఁ బొందుచు సుఖంబిందుకే వెదకీని వొడలు మోవఁగ జీవుఁడోపననలేఁడు చ. వుదకమయమగుకన్ను లురికి యేమైనఁగని మదవికారము మతికి మరుపఁగాను యిది యెరిఁగి తిరువేంకటేశుఁగని జీవుఁడాసదమలానందంబు చవిగానలేఁడు పె.అ.రేకు:0019-01 శంకరాభరణం సంపుటము: 15-105 పల్లవి: ఏఁటి వివేకము యొరవుల చిత్త మిదె తాఁటలు దూఁటలలోనె తగిలి యుఁడుఁ గాకా చ. తను నెఱిఁగి రక్షింప దైవమే నేరుచుఁ గాక మనుజుఁ డే మెఱుఁగు వున్మత్తుడే పెనఁగి పంచేంద్రియపు పెంపుడుఁగుఱ్ఱ దాను పొనుగ కందులోననే పారలాడుఁ గాకా చ. కాల మెఱిఁగి పోఁ పొందను కర్మమె నేరుచుఁ గాక కూళజీవుఁ డేమెఱుఁగు గుణబదుఁడు ఆలరి కామాదులకు నరిఁగాపై వుండుఁ దాను