పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

364 వూరకే బ్రహ్మకల్పము లుండేటట్టి బలిమో చ. పరగ శ్రీపతినామపఠనము బలిమో హరిదాసుల శరణన్నట్టి బలిమో సిరుల శ్రీవేంకటేశు సేవచేసిన బలిమో గురుభక్తితోడ నెక్కువయైన బలిమో పె.అ.రేకు:0005-05 దేసాళం సంపుటము: 15-030 పల్లవి: ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము యే యపరాధమో కాని యింతేసి సేసితిని చ. ఆముకొని నీ దాసుఁడ ననేటి సలిగలను వేమారుఁ బాపములకు వెరవ నైతిని నీ మఱుఁగు చొచ్చినట్టి నిజగర్వమే నమ్మి నేమపు పుణ్యములు మానితి నేను చ. తగిలి నీ ముద్ర మేన ధరించిన చనవున పగటున దేవతల పంపు సేయను నగుతా నీ నామము నాలికనున్న బీరాన జగతి నిత్య కర్మము జారి పోఁదోసితిని చ. హత్తి నాకుఁగలవు నీ వంతర్యామి వనుచు వుత్తమోపాయము లెల్ల నొల్ల నైతివి యిత్తల శ్రీ వేంకటేశ యేలికవు నీ వని మత్తుఁడనై అన్యచింత మఱచితిని రేకు: 02:19-01 దేసాక్షి సంపుటము: 03–102 పల్లవి: ఏ లోకమున లేఁడు యింతటి దైవము మరి జోలిఁ దవ్వితవ్వి యెంత సాదించినాను చ. మంచిరూపున నెంచితే మరుని గన్నతండ్రి ఇంచుకంత సరిలేదు ఇతనికిని మించు సంపదలనైతే మేటిలక్షీకాంత్రుఁడు పొంచి యీతనికి నీడు పురుఁడించఁగలరా చ. తగఁ బ్రతాపమునను దానవాంతకుఁ డితఁడు తగుల నీతని మారుదైవాలు లేరు పొగరు మగతనానఁ బురుషోత్తముఁ డితఁడు వెగటై యీతనిపాటి వెదకిన లేరు చ. పట్టి మొదలెంచితేను బ్రహ్మఁగన్నతండ్రితఁడు మట్టున నింతటివారు మరి వేరి ఇట్టే శ్రీవేంకటేశుఁడీగికి వరదుఁడు ట్ట కొట్టఁగొన నితరుల గురిసేయఁగలరా రేకు:0298-05 సామవరాళి సంపుటము: 03-570 పల్లవి: ఏ వల్ల నౌఁగాము లిఁక నేవి అన్నియు నీలోనే శ్రీవల్లభుఁడ నిన్నుఁ జేటితిమి నేము చ. సగుణనిరుణములును సావయవనిరవయవ మగుఁ దర్కవాదకలహములు ఘనము జగములో చదువులును సంశయంబే కాని తెగనీదు నీ మాయ తెలియ వసమూ చ. వేదమార్గము గొంత వేదబాహ్యము గొంత పాశీది మతములవాలి పాశీరు ఘనము పాదైన మునిరుషులు బహుముఖములే కాని