పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

365 సాదించి వొకమాట చూపంగ లేరు చ. వెస గర్మ మొకవంక విజ్ఞాన మొకవంక వసగావు రెంటి బలవంతములును వసుధ శ్రీవేంకటేశ్వర నీవు గావు మిఁక ముసుగు వెట్టినవాదు ముగియదెంతైనా పె.అ.రేకు: 0065–05 ధన్నాసి సంపుటము: 15-392 పల్లవి: ఏ వుపాయము నెఱుఁగ యిదె నీకు విన్నపము శ్రీవల్లభ నీవే రక్షించుకోనీ బంటను చ. కొందరు తపోమహిమఁగోరి దొడ్డవా రవుదురు పొందఁ జదివి కొందరు పూజ్య లౌదురు కందువ పుణ్యమున స్వర్గ మేలుదురు కొందరు ముందే నేనైతే నీ ధర్మమున నుండేవాఁడను చ. తమ యాత్మనే తలఁచి ధన్యు లౌదురు గొందరు తిమిరి దానాలు చేసి దివ్య లౌదురు గొందరు నెమకి కాయసిద్ధిచే నిత్యులౌదురు గొందరు ప్రమదాన నేనైతే నీ ప్రభావమువాఁడను చ. గట్టిగా సత్యమే ఆడి ఘను లౌదురు గొందరు పట్టిన వ్రతములను బ్రదుకుదురు గొందరు యిట్టె యలమేలుమంగ నేలిన శ్రీవేంకటేశ పట్టి నేనైతే నిన్నుఁ బాడేటివాఁడను రేకు: 0159-04 వరాళి సంపుటము:02-285 పల్లవి: ఏఁటి జాణతనమే యేమే నీవు కోటియైనా యాఁటది కక్కూరితికిఁ జొచ్చునా చ. వరుసకువచ్చి యావనిత గాచుకుండఁగా యెరవలసన్నఁ బతినేల పిల్చేవే తెరమఱంగున నొక్కెతకు మీఁదెత్తిన మోవి యిరవుగ నీకది యెంగిలిగాదా చ. పొందైనయాపె యింటిలో బోనము వెట్టుకుండఁగా విందు నీవేల చెప్పేవే విభునికిని అందాకె మనసు పెట్టినటువంటి కాఁగిలికిందటనే వాఁడి మిగిలినది గాకా చ. సేసవెట్టిన మగువ చెఱఁగువట్టకుండఁగా ఆసతో నీవెట్టుగూడి యలరితివే యీసరినే శ్రీవేంకటేశుఁడిట్టె నన్నుఁ గూడె వోసరించితే బువ్వము వూరఁబొత్తుగాదా రేకు:0218-03 లలిత సంపుటము: 03-098 పల్లవి: ఏఁటి నేను యేఁటి బుద్ధి యొక్కడి మాయ వీటిఁ బొయ్యే వెట్టిఁ గాను వివేకిఁ గాను చ. ఆరసి కర్మము సేసి అవి(ది?) నన్నుఁ బొదిగితే దూరుదుఁ గర్మము గొంది దూరుచు నేను నేరక లంపటములు నేనే కొన్నిగట్టుకొని పేరడిఁ బరులనందుఁ బెట్టరంటాను చ. యొక్కుడు నా దోషములు యెన్నెనా వుండఁగాను వొక్కరి పాపము లెంతు వూరకే నేను తిక్కవట్టి నాకు నాకే దేవతలకెల్లా మొక్కి