పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

363 రేకు: 01:15-04 గుండక్రియ సంపుటము: 02-088 పల్లవి: ఏ పురాణముల నెంత వెదకినా శ్రీపతిదాసులు చెడరెన్నఁడును చ. హరివిరహితములు అవి గొన్నాళ్ళకు విరసంబులు మరి విఫలములు నరహరిఁ గొలిచిటు నమ్మిన వరములు నిరతము లెన్నఁడు నెలవులు చెడవు చ. కమలాక్షుని మతిఁగానని చదువులు కుమత్రOబులు బహుకుపధములు జమళి నచ్యుతుని సమారాధనలు విమలములే కాని వితథముగావు చ. శ్రీవల్లభుగతిఁ జేరని పదవులు దావతులు కపటధర్మములు శ్రీవేంకటపతి సేవించు సేవలు పావనము లధికభాగ్యపు సిరులు రేకు:0252-04 దేసాక్షి సంపుటము: 03-299 పల్లవి: ఏ పొద్దు చూచిన దేవుఁ డిటానే యారగించు రూపులతోఁ బదివేలు రుచులై నట్లుండెను చ. మేరుమందరాలవలె మెరయు నిడ్జెనలు సూరియచంద్రులవంటి చుట్టుఁబళ్ళేలు ఆరనిరాజాన్నాలు అందుపై వడ్డించఁగాను బోరన చుక్కలు రాసి వోసినట్లుండెను చ. పలు జలధులవంటి పైఁడివెండిగిన్నెలు వెలిఁగొండలంతలేసి వెన్నముద్దలు బలసిన చిలుపాలు పంచదార గుప్పఁగాను అలరు వెన్నెలరస మందిచ్చినట్లుండెను చ. పండిన పంటలవంటి పచ్చళ్ళుఁ గూరలును వండి యలమేలుమంగ వడ్డించఁగా అండనే శ్రీవేంకటేశుఁ డారగించీ మిగులఁగ దండిగా దాసులకెల్లా దాఁచినట్లుండెను రేకు: 0305-04 ముఖారి సంపుటము:04-028 పల్లవి: ఏ బలిమి నమ్మి వెరపెరఁగరు దేహులాల గాబువలెఁ బెరిగేరు కాలము మిచుట్టమా చ. చెలరేఁగి దానములు సేసినట్టి బలిమో అలరి కర్మము సేసినట్టి బలమో చలపట్టి తపము లాచరించిన బలిమో కొలఁదిలేక సురలఁ గొలిచిన బలిమో చ. ధీరత సుజ్ఞానము దెలిసిన బలిమో కోరక విరక్తి గైకొన్నబలిమో శూరత లోకానకెల్లఁ జుట్టమైన బలివమో