పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

362 చ. కొందరికి సుఖుమిది కొందరికి దుఃఖమిది యిందుఁ జిక్కి బ్రహ్మమునకీ ఘనోరమేలా అందిన శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డొక్కఁడింతే మందలించి కొలువరు మంటికా మీ జ్ఞానము రేకు:0005-06 సామంతంసంపుటము: 01-035 పల్లవి: ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ వాని నన్నొకయింత వదలక నను నేలవలదా చ. అపరాధింగనక నన్నరసి కావుమని అపరిమితపు భయ మంది నీకు శరణంటిఁగాక నెపములేక నన్ను నీకుఁ గావఁగ నేల అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా చ. ఘనపాపిం గనక నీకరుణ గోలి నీ– వనవరత్రము నాయూత్రుమ విహరించుమంటిఁ గాక యొనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకుననఘుఁడ పరమతత్త్యానంద తిరువేంకటాధిప రేకు:0210-06 ఆహిరి సంపుటము: 03-060 పల్లవి: ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును నే నిన్నుఁ దలఁచినది నిమిషమూ లేదు చ. పాయమెల్ల సంసారముపాలే పడితిఁ గాని చేయూర నీ సేవ నేఁ జేసుట లేదు కాయమెల్ల కాంతలకే కడు.శేషమాయఁగాని నీ యవసరములందు నే నొదుగలేదు చ. చిత్తము ఆసల పాలే సేసి బదికితిఁ గాని హత్తి నిన్ను ధ్యానము సేయఁగలేదు సత్తెపు నా నాలుకెల్ల చవుల కమ్మితిఁ గాని మత్తిలి నీ కీర్తనము మరపుటా లేదు చ. పుట్టగెల్లా నజ్ఞానముపొంతనే వుంటిఁ గాని వొట్టి నీవిజ్ఞానము నొల్లనైతిని యెట్టు నన్ను మన్నించితి విందుకే పో వెరగయ్యి నెట్టన శ్రీవేంకటేశ నిన్నడుగా లేదు రేకు:0278-06 గుండక్రియసంపుటము: 03-452 పల్లవి: ఏ పాటి తన కర్మ మాపాటి కాపాటె శ్రీపతిదాసుఁడయితే చిహ్న లిటువలెఁ బో చ. అందరిని నిర్మలులే యని తలఁచిన తన నింద లేని మనసే నిర్మలము మందలించి లోకులతో మంచి మాఁట లాడితేను బందెలేని తన నోరే భావించ మంచిది చ. అంతటాను హరి యున్నాఁడని చూచినఁ దన యంతరంగమున నుండు నీ దేవుఁడే చింతించి యీ జగము చేకొని పావనమంటే పంతపు తన దేహముఁ బరమపావనమే చ. పుట్టితేఁ దన పాలికిఁ బుట్టే నీ ప్రపంచము దట్టమైన పుట్టెల్లఁ దనతోడిదే యిట్టే శ్రీవేంకటేశుఁడిచ్చినాఁడీ గుణము పట్టమై నావద్దనుండు పరమవిజ్ఞానము