పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

356 చ. నిక్కి నిక్కి చేతులెత్తి నీకు మొక్కుదురుగాని మక్కువ నీమహిమ నమ్మఁగలేరు యిక్కడ శ్రీవేంకటేశ యిటు నీకరుణచేత తక్కక నిన్ను సేవించి తనియలేరు రేకు:0108-01 లలిత సంపుటము: 02-043 పల్లవి: ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో దవ్వు చేరువకు తానే గురుతు చ. పరమమంగళము భగవన్నామము సురులకు నరులకు శుభకరము యిరవుగ నెఱిఁగిన యెదుటనె వున్నది వరుసల మఱచినవారికి మాయ చ. వేదాంతసారము విష్ణుభక్తి యిది ఆదిమునుల ముత్ర మయినది సాదించువారికి సర్వసాధనము కాదని తొలఁగిన గడుశూన్యంబు చ. చేతినిధానము శ్రీవేంకటపతి యేతలఁ జూచిన నిందరికి నీతియు నిదియే నిజసేవకులకు పాత్రకులకు నది భవసాగరము పె.అ.రేకు: 0065–05 శ్రీరాగం సంపుటము: 15-375 పల్లవి: ఎవ్వరివంకా నే మున్నది నవ్వుచు నీశ్వర ననుఁ గావఁ గదే చ. ప్రతిబంధములకుఁ బంత మిచ్చితిని రత్రి నా తెరు వి(క రాకు ముని గతిమాలి మాయకు కడు వీఁ పొగ్గితి మతి నను నేఁపక మన్నించు మనుచు చ. చెప్పితిఁ బ్రియములు చిత్రగుప్శనకు తప్పక కవెలలు దాచు మని ముప్పిరి మొక్కితి మునుపనే మనసుకు యెప్పుడుఁ గదలకు నేగకు మనుచు చ. వూరడించితిని వొడఁబరచి నిద్రను సారె నేమరించకు మనుచు యీరీతి శ్రీవేంకటేశ యులసితిని చేరి నన్నుఁ గృప సేయఁగదే రేకు:0257-05 లలిత సంపుటము: 03-330 పల్లవి: ఎవ్వరివాఁడాఁ గాను యిదె పిరివీకులై నవ్వుచు నీ శరణంటి నన్నుఁ గావవయ్యా చ. తగఁ బంచేంద్రియములు తమవాఁడననేరు వగఁ దల్లిదండ్రి తమవాఁడననేరు చిగురుఁగర్మాలు తమసీమవాఁడననేరు తెగదీ తగవు నీవే తిద్దవయ్యా చ. కొందరు నరకమందు కొంతవళకు వేసేరు కొందరు స్వర్గమువారు కొంతవళకు వేసేరు యిందుకు నందుకుఁ బోనీ రిహలోకమందువారు దిందుపడని వళకు తీరుచవయ్యా