పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

355 రేకు:0164-01 ముఖారి సంపుటము: 02-306 పల్లవి: ఎవ్వరికి యెవ్వరయ్యేరు యిందరికి నీవే దిక్కు అవ్వలనివ్వల నీ వనాథనాథుఁడవు చ. కాయకము లందురునుఁ గార్యవశపరులే పాయని నీ వకారణబంధుఁడవు దాయగాం డైవ్వరినైనాఁ దప్పించుకొనేవారే బాయటనున్నా నీవాపన్నశరణ్యుఁడవు చ. అట్టె లోకమువారు అర్థకామపరులే జట్టిగొని నీవైతే సర్వదాతవు పొట్టఁబొరుగుచుట్టాలు భోజనసహాయులే నెట్టన నీవైతే మాకు నిర్వాహకుఁడవు చ. అంతటా వారికివారు ఆత్మపోషకులే రంతుల నీవైతే నానారక్షకుఁడవు సంతతము శ్రీవేంకటేశా మమ్ము నేలితివి పంతమున నీవు భక్తపరిపాలకుఁడవు రేకు: 0038-03 ముఖారి సంపుటము: 01-233 పల్లవి: ఎవ్వరికైనను యీ వ్రాఁత నను నవ్వులు సేసెఁబో నా వ్రాఁత చ. తొలిజన్మంబున దోషకారియై నలుగడఁ దిప్పెను నా వ్రాఁత యిల దుర్గణముల కీజన్మంబున - నలఁకువ నేనెఁబో నా వ్రాఁత చ. పురుషునిఁజే శల్పుని ననిపించుట నరజన్మమునకు నా వ్రాఁత తరుచయ్యినపాతక మరుపెట్టుక నరకము చూపెఁబో నా వ్రాఁత చ. పామఱితనమున బహువేదనలను నామన సెనసెఁబో నా వ్రాఁత కామితఫలు వేంకటపతినిఁ గొలిచి నామతి దెలిపెఁబో నా వ్రాఁత రేకు: 0160-01 భైరవి సంపుటము:02-287 పల్లవి: ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది రవ్వ సేయక జీవుల రక్షించవయ్యా చ. తలపోసి తలపోసి ధ్యానము సేతురు నిన్ను యెలమి నింతని నిశ్చయింపలేరు పలుమారు నీగుణాలు పైకొని నుతింతురు కొలఁదివెట్టుచు మీగుఱుతు లెంచలేరు చ. పొదిగి పొదిగి నిన్నుఁ బూజలెల్లాఁ జేతురు యెదుట నీశ్రీమూర్తి యొఱఁగలేరు వెదకి వెదకి సారె విందురు నీకతలెల్లా పదిలపు నీభ క్తి పట్టఁగలేరు