పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

354 అరయ శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి యిరవై ఇట్టుండకున్న నెట్టు గొలిచేనయ్యా రేకు:0239-04 ముఖారి సంపుటము: 03-225 పల్లవి: ఎవ్వరి వసము గెల్వనింతా వీనిమయమే యివ్వల నీవు గాచితేనేమోకాని చ. వొక్కలోభము నెంచితే వొగి లోకమెల్లాఁ దానే యొక్కడ చూచినాఁ దానే యీదీపనము వెక్కసమైనది తానే వేగిలేచి సేసేపని తక్కక యిన్నిటా నెట్టు తప్పించుకోవచ్చును చ. పలుమారు వచ్చీ(దానే పనిలేని పరాకు వళచుకొన్నది తానే వట్టిభీతి నిలుచుకున్నది తానే నిలువుననే సిగ్గు మెలుపున నెటువలె మొదలఁగవచ్చును చ. కనుగొంటే నెందూఁ దానే కార్పణ్యము దైన్యము అనిశము మించీఁ దానే యాచకత్వము నను నేలకొంటి విదే నమ్మితి శ్రీవేంకటేశ జనుఁడను యివి నేను సాధించుటెట్టు రేకు:0002-03 బౌళి సంపుటము: 01-009 పల్లవి: ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంట యెవ్వరిఁ గొలిచిన నిది నీకొలువు చ. అవయవములలో నదిగా దిదిగా దవి మే లివి మే లన నేలా భువియుఁ జూతాళము దివియు నOదలిజOతునివహ మింతయునూ నీదేహమేకాన చ. నీవు లేనిచోటు నిజముగఁ దెలిసిన ఆవల నది గా దనవచ్చును శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము భావింప నీవే పరిపూరుఁడవుగాన రేకు: 9106-01 శ్రీరాగం సంపుటము: 04-594 పల్లవి: ఎవ్వరిఁ దలఁపఁడు ఎవ్వరి నొల్లఁడు నవ్వుల తెరువులె నడచీఁ బ్రాణి చ. కలుషముఁ బుణ్యము కర్మపుఁ జేనను వెలయఁగ జీవుఁడు విత్తుచును కలిగిన సుఖదుఃఖములను గాదెల కొలుచులు నించుక కుడిచీఁ బ్రాణి చ. చెడని ప్రపంచము శెశెదిదిలో నిడుపు గురుచలుగ నేసినది వడి దేహములను వన్నెల వన్నెల గడనల చీరలె కట్టీఁ బ్రాణి చ. కూరిమిఁ గామక్రోధాదులు మతి చూరలఁ గొనియెడి చుట్టములే గారవముల వేంకటపతిఁ గొలువక చేరి కాఁపురము సేసీఁ బ్రాణి