పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

353 యెపుడును శ్రీవేంకటేశ నీ చిత్తమింతే విపరీతములు లేవు వెలితీ లేదు రేకు: 0269-02 మలహరి సంపుటము: 03-396 పల్లవి: ఎవ్వరి దూరఁగఁ జోటు లేదు మరి యేమనఁ గలదిదివో తగవు యివ్వల నందరి బడిబడిఁ దిరిగే యీకర్మముదే నేరమి చ. నీ దాసులకును నేరమి లేదు నీవే గతియని వుండఁగను ఆదినుండి నీకును నేరమి లేదఖ9లానకుఁ గర్తవుగాన పాదుపడక నడుమనుఁ దిరిగాడెడి ప్రపంచముదే నేరమి యేదెస నొకచో నిజమేరుపడక యిటువలెఁ దిరిగాడెడిఁ గాన చ. పాపము లేదిదే యజ్ఞానులకును భావమెరంగని పశువులు గాన మోపై సుజ్ఞానులకునుఁ బాపము మోవదు నినుఁ గొలిచిరి గాన చాపలముగ నమ్మించి చెరుచు పలుచదువులదే యీ పాతకము పైపై నొకయర్థ మేరుపరచక భ్రమయఁగ వాదము వెట్టెడిఁ గాన చ. యీలోకులకును అధర్మము లే దిన్నియు నీచేఁతలే కాన మూలనున్నముక్తులకు నధర్మము మొదల లేదు నీ కృప గనక కాలము గడపుచు నీవు రచించిన కపటపు మాయదే అధర్మము అలరి శ్రీవేంకటేశ్వర య(యె?)క్కడనడ్డము తానేవచ్చీఁ గాన రేకు:0271-01 సామంతం సంపుటము: 03-406 పల్లవి: ఎవ్వరి దూరఁగనేల యేమీ ననఁగనేల నవ్వుచు హరికి మొక్కి నడచుటఁ గాక చ. కోపమే యొక్కుడు సేసు కొందరి గుణములోన పాపమే యొక్కుడు సేసు పరులఁ గొందరికి దీపన మొక్కుడు సేసు దేహములఁ గొందరికి శ్రీపతి ఆనాజ్ఞ లివి చెల్లీ లోకానను చ. కొందరి నసురలఁగా గుట్టుతోడ నటు సేసు కొందరి దేవతలఁగా కోరి తానే యిటు సేసు కొందరి మనుజులఁగా కూటపు జీవులఁ జేసు విందువలె హరిమాయ వెలసి లోకానను చ. వరుస నెరిఁగి నడవ నెవ్వరి కిచ్చగాదు సరిని వనాది నుండే సహజమే కలది చిరపుణ్యు లిన్నిటిలో శ్రీవేంకటేశుఁ గని శరణనఁగా సుఖము జరగీ లోకానను రేకు: 0194-01 కన్నడగౌళ సంపుటము:02-480 పల్లవి: ఎవ్వరి నేమనఁగల నెంతబలువుఁడ నేను నవ్వుచు నీవే యిఁక నన్ను మన్నించవయ్యా చ. కామక్రోధములకు కాణాచికా(పను ఆమని యింద్రియముల కడిబంటను దీమనపు టాసలకు తీరని లగ్గసుఁడను (?) యీ మరఁగువాఁడ నిన్ను నెట్టు గొలిచేనయ్యా చ. పాయని సంసారానకు బడివనివాఁడను కాయపు భోగాల వూడిగపువాఁడను పాయపు మదములకు పంగెమైనవాఁడను (?) యీయెడ నీవాఁడ నని యెట్టు గొలిచేనయ్యా చ. సరిఁ గర్మములకెల్ల చనవరి బొడుకను పొరలే జన్మముల యప్పలవాఁడను