పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

352 యింపుల శ్రీవేంకటాద్రి నిరవై వున్నాఁడు వీఁడె పంపుడు దేవతలతోఁ బ్రతిలేని దైవము పె.అ.రేకు:0024-05 పాడి సంపుటము: 15-139 పల్లవి: ఎవ్వరేమి సాదించే రెవ్వరు నే మెఱిఁగేరు అవ్వల నివ్వల శ్రీహరియే దైవము చ. జగములోపల హరి సాత్విక దైవమని భృగువె సాదించినాఁడు పృధివిఁ దొల్లె ముగురువేలుపులలో మొరవెట్టిరితనికె జిగి మించ దేవతలు క్షీరాబ్దికాడనే చ. ధరఁగాశిలోన హరి తారకబ్రహ్మమని హరుఁడే బోధించఁ జొచ్చెనందరికిని అరుదుగా రామనామ మత్రని పట్టపురాణి గిరిసుత పార్వతి కీర్తింపఁ దొడఁగే చ. అదిగో శ్రీ వేంకటాద్రి హరి పరతత్త్యమని యెదుటనె బ్రహ్మ పుట్టె యితని నాభిని యిదిగో మన మిందర మతనినే కొల్చి బ్రదుకుద మిటు రారో ప్రాణులాల మీరు రేకు:0012-03 రామక్రియ సంపుటము: 01-074 పల్లవి: ఎవ్వఁడో కాని యెరఁగరాదు కడుదవ్వులనే వుండు తలఁపులోనుండు చ. ఎడయవు తనరెక్క లెగసిపోలేఁడు కడు దాఁగుఁగాని దొరింగయుఁ గాడు వడిఁగిందుపడును సేవకుఁడునుఁగాఁడు వెడఁగుగోళ్ళు వెంచు విటుఁడునుఁగాఁడు చ. మిగులాఁబొట్టివాఁడు మింటికినిఁ బొడవు జగడాలు తపసివేషములును మగువకై పోరాడు మరి విరక్తుఁడును తగుఁగాపుఁబనులు నెంతయుఁ దెల్లఁదనము చ. తరుణుల వలపించు తగిలి పై కొనఁడు తురగముఁ దోలు రౌతునుఁ గాఁడు తిరువేంకటాద్రిపెఁ దిరుగు నెప్పుడును పరమమూర్తియై పరగు నీఘనుడు రేకు: 0300-06 దేసాళం సంపుటము: 03-583 పల్లవి: ఎవ్వరము నేమి సేసేమేమి గడమలు నీకు రవ్వగా శరణంటే రక్షించుటింలే చ. అందరుఁ జేసిన కర్మములవి నీకు జీవనమై అంది జీవించేవంటే నదియూఁగాదు కొందరు సురల(లు?)తోడై కూడి రాఁగా నసురలయిందరి గెలిచేవంటే నిదియూఁగాదు చ. వొకచోటఁ గలవు వేరొక చోట లేవంటే నకటా యోంచి చూచిన నదియూఁ గాదు మొకమిచ్చి వొక గుణమునఁ దిరిగేవంటే సకలగుణు(డ వాజాడయుఁ గాదు చ. కపట మిదనరాదు కడునవు ననరాదు వుపమించరాదు వొల్లకుండఁగరాదు