పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

357 చ. కాంతలు తమవాఁడంటాఁ గనుచూపులఁ గట్టేరు చెంతలఁ గాంచనములు చేయివటుకొనె నన్ను ఇంతటా శ్రీవేంకటేశ యెదలోనున్నాఁడవు వంతుకీ తగవు నీవే వహించుకోవయ్యా రేకు: 0325–01 వరాళి సంపుటము: 04–142 పల్లవి: ఎవ్వరివాఁడాఁగాను యేమందు నిందుకు నవ్వుచు నాలోని హరి నన్నుఁ గావవే చ. కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్ళు మేను చూపుడుఁబూఁట వెట్టితి సాగసి నేను యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను దాపుగ తొర్లుఁబూఁట తగిలించుకొంటిని చ. మొదలఁ గర్మములకు మోసపోయి యీ బ్రదుకు కుదువపెట్టితి నే గురి గానక వెదకి కామునికి విషయములకు నే అదివో నావయసెల్ల నాహివెట్టితిని చ. ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు కప్పినగురుఁడు నీకు క్రయమిచ్చెను వొప్పించి రిందరు బలువుఁడు చేపట్టెననుచు అప్పలెల్లఁబాసి నీసామ్మెతినేనయ్యా రేకు:0086-03 దేసాక్షి సంపుటము:01-419 పల్లవి: ఎవ్వరివాఁడో యీదేహి యివ్వలనవ్వల నీదేహి చ. కామించు నూరకే కలవియు లేనివి యేమి గట్టుకొనె నీదేహి వాములాయ నిరువదియొక వావులు యేమని తెలిసెనో యూదేహి చ. కందువ నిజములు గల్లలు నడిపీ యెందుకు నెక్కెనో యీ దేహి ముందర నున్నవి మొగిఁ దనపాటు యిందే భ్రమసీ నీదేహి చ. పంచేంద్రియముల పాలాయ జన్మము యించుక యొఱఁగఁడు యీదేహి అంచెల శ్రీవేంకటాధీశ నీకృప వంచ(గ గెలిచెను వడి నీదేహి రేకు:0095-02 గుండక్రియ సంపుటము: 01-472 పల్లవి: ఎవ్వరివాఁడో యెఱఁగరాదు అవ్వలివ్వలిజీవుఁ డాటలో పతిమే చ. ధర జనించకతిరెలుత్ర త్రనుఁ గానరాదు మరణమందినవెనక మఱి కానరాదు వురువడిదేహముతో నుండినయన్నాళ్లే మరలుజీవునిబదుకు మూయవో చూడ చ. యిహములో భోగించు నిందుఁ గొన్నాళ్లు మహిమ పరలోకమున మలయుఁ గొన్నాళ్లు తహతహలఁ గర్మబంధములఁ దగిలినయపుడే అహహ దేహికిఁ బడుచులాటవో బదుకు