పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

349 యింతట శ్రీ వేంకటేశ్వర నిన్నే రంతుల శరణనె రక్షించవే రేకు:0171-01 ధన్నాసి సంపుటము:02-344 పల్లవి: ఎఱఁగక వేసారు నిల జీవుఁడు మెఱసి నిండుకున్నాఁడు మేఁటి యీ దేవుఁడు చ. వూరకే పరాకైనట్టుండును దేవుఁడు నారుకొన మతిలోఁ దనపైనే చింత గారవాన మరి పలుకనియట్టే వుండును యీరీతి మాటాడించేవాఁ డిన్నిటా నితఁడే చ. యెందు లేనియట్టే వుండు నెంచి చూచితే దేవుఁడు చెంది లోకశరీరియై చెలరేఁగీని అందరాక యొక్కడాను అడఁగినట్లనే యుండు యిందరిఁ బోషించేవాఁడు యెప్పుడూ నితఁడే చ. చేరి లోనుగానెట్టుండు శ్రీవేంకటేశదేవుఁడు కోరినవరము లిచ్చు గురుతుగాను వారక యలమేల్మంగ వల్లభుండిట్టిదేవుఁడు యీరూపుతో నుండు నిందరిలో నితఁడే రేకు:0198–01 శ్రీరాగం సంపుటము:02-502 పల్లవి: ఎఱిఁగితి నమ్మితి నితఁడు దయానిధి మఱఁగులు మొరఁగులు మరి యిఁక లేవు చ. వేదోద్ధరణుఁడు విశ్వరక్షకుఁడు ఆదిమూర్తి శ్రీఅచ్యుతుఁడు సోదించి కొలిచితి సుముఖుఁడై మమ్మేలె యేదెస మాపాల నితఁడే కలఁడు చ. పరమపురుషుఁ డాపన్నివారకుఁడు పూలి శాంతుఁడు నారాయణుఁడు శరణంటి మితఁడు చేకొని కాచెను తరవాతిపనులఁ దప్పఁడితఁడు చ. హృదయాంతరంగుఁడు యీశ్వరేశ్వరుఁడు ఇదివో శ్రీవేంకటేశ్వరుఁడు వెదికితి మీతఁడు విడువఁడు మమ్మిఁక తుదకును మొదలికి దొరికినవాఁడు రేకు:0173-01 మలహరి సంపుటము: 02-356 పల్లవి: ఎఱిఁగినవారికి హింస లిన్నియు మాని మఱి సత్యమాడితేను మాధవుఁడే దిక్కు చ. కలుగుఁ గారణములు కామక్రోధములు రేఁగ వెలసిన మూయవికార మది కలఁగఁగ వలనదు కర్త లెవ్వరుఁ గారు తెలిసి వోరుచుకొంటే దేవుఁడే దిక్కు చ. పదార్థా లెదుట నిలుచుఁ బంచేంద్రియాలు రేఁగ వెదచల్లేటి మాయావికార మది పదరి పైకొనవద్దు పట్టితేఁ బసలేదు చెదరక వోరిచితే శ్రీపతే దిక్కు చ. సిరులు తానే వచ్చే చిత్తాన నాసలు రేఁగ విరసపు మూయూవికారమది