పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

348 యిష్టానిష్టము మాకు నేఁటిదయ్య నష్టి లేదు నడచేది నడవక మానరాదు తష్టి గట్టుకొంటిఁగాక తా మానఁబొయ్యీనా రేకు:0378–03 వరాళి సంపుటము: O4-455 పల్లవి: ఎరిఁగీ నెరఁగదు యేమి సేతు మతి హరిదాస్యం బదియే సుఖము చ. వెతలఁబొరలే ఘన విభవముకంటే అతి పేదరిక మది సుఖము గతి నెరవుల సింగారము కంటెను సత మగు తన నిచ్చలమే సుఖము చ. పలుబాములఁబడు పగలిటికంటే తెలిసి నిద్రించు రాతిరి సుఖము అలమట గడించు నమృతముకంటే కలపాటి తనకు గంజే సుఖము చ. పరపీడలోసఁగు భవమునకంటే ధరఁ బొడమని చందము సుఖము గరిమల శ్రీ వేంకటపతి నీకే శరణని యెడి నాజన్మమే సుఖము రేకు:0041-05 శంకరాభరణం సంపుటము: 01-253 పల్లవి: ఎరుఁగుదు రిందరు నెఱిఁగీనెఱఁగరు హరి దానే నిజపరమాతుమని చ. నలినాసను( డెఱుఁగు నారదుఁ డెఱుఁగు కొలఁది శివుఁ డెఱుఁగు గుహుఁ డెఱుఁగు Oుల గపిలుఁ డెఱుఁగు నిOత్రా మను వెఱుఁగు తలఁప విష్ణుఁడే పరతత్వమని చ. బెరసి ప్రపూదుఁడు భీష్ముఁడు జనకుఁడు గురుతుక బలియు శుకుఁడుఁ గాలుఁడు వరుస నెఱుఁగుదురు వడి రహస్యముగ హరి యితఁడే పరమాత్ముఁడని చ. తెలియదగిన దిది తెలియరాని దిది తెలిసినాను మదిఁ దెలియు దిది యిల నిందరుఁ దెలిసి రిదే పరమమని కలవెల్లఁ దెలిపె వేంకటరాయుఁడు రేకు: 0369-01 గుండక్రియ సంపుటము: 04-404 పల్లవి: ఎఱఁగఁడు పరసుఖ మీశ్వర నీమాయ నెఱి విచారముల నెగడిన దాఁక చ. అతిహేయములో నడరు వరాహము అతిహేయము సుఖమని తలఁచు మతి సంసారంబే మరగిన యూతుమ పతిలేని దిదే పరమని తెలియు చ. పొరి విషయములోనఁ బొడమిన కీటము అరిది విషమ తీపని తినును పరగ యోని సంభవమగు దేహాతుమ పెరిగి యందుకే ప్రియపడును చ. యింతేసి నిన్నియు నెరఁగిన యీ యాతుమ అంతరాత్మ నీవని తలఁచి