పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

347 యెలమి శ్రీవేంకటేశునెంచి చూచితే కలిమిగల యూకాంత్రకాఁగిటఁ బెనఁగఁగాను నిలువెల్లా సిరులై నిండినట్టుండెను రేకు: 0375-01 బౌళి సంపుటము:04-437 పల్లవి: ఎప్పటిజీవుఁడే యొప్పటిజగమే యెంతగాలమును నీరీతే కప్పకవచ్చితి వనాదినుండియు కర్మము యింకా వేసరవా చ. మఱచితివా తొలుజన్మంబుల మరణకాలముల దుఃఖపుబాట్లు మఱచితివా యమకింకరులయి మర్ణించిన బహుతాడనలు మఱచిత్రివా నరకకూపముల మూఁటికి మూఁటికిఁ బరచిన బాధలు మఱియును సుఖమని భవమే కోరెదు మనసా ముందర గానవుగా చ. తలఁచవుగా జననకాలమునఁ దనువిదియే యిటు పుట్టిన రోఁతలు తలఁచవుగా బాల్యంబునఁ దల్లితండ్రుల శిక్షలు వ్యాధులును తలఁచవుగా సంసారమునకును దైన్యంబును యూచించెటి యలమట తలఁపుననిదియే వలెనని వోమెదు తనువా యింకా రోయవుగా చ. కంటివిగా మలమూత్రాదుల కడుగఁగఁ దీరని దినదినగండము కంటివిగా కనురెప్పలనే కాలముగడచేటికడత్రోవ కంటివిగా శ్రీవేంకటపతి కరుణచేత నీ వివేకభావము అంటి యిటువలెనె సార్వకాలమును అంతరాత్మ నినుఁదలఁచగా రేకు:0365–03 శంకరాభరణం సంపుటము:04-383 పల్లవి: ఎప్పు ಡೆಬುದ್ದಿ వుట్టునో యొరఁగరాదు దెప్పరపు మా బ్రదుకు దేవునికే సెలవు చ. యేడనుండి పుట్టితిమో యింతక తొల్లి యింక - నేడకు బోయెదమో యిటమీఁదను వీడని మాయంతరాత్మ విష్ణుఁడు మా - జాడ జన్మమతనికే సమర్పణము చ. గతచన్న పితరు లక్కడ నెవ్వరో హితవై యిప్పటి పుత్రు లిదియెవ్వరో మతి మాజీవనమెల్ల మాధవుఁడు అతనికే మాఖోగాలన్నియు సమర్పణము చ. తొడికి స్వర్గాదులు తొల్లియాడవో యీ - నడచే ప్రపంచము నాకేడదో కడఁగి శ్రీ వేంకటేశు గతియే మాది అడఁగు మా పుణ్యపాపా లతని కర్పణము రేకు: 0334-02 లలిత సంపుటము: 04-197 పల్లవి: ఎప్పుడూను నడచేవె యేకాలమైనాను కప్పి నిషూరమేల కట్టేరయ్యా చ. శ్రీపతి యాణాజ్ఞచేతఁ జిక్కనది జగము యేపున మా యాణాజ్ఞ లేఁటివయ్య కోపగించుకొనుటింలే కొంకక లోకాలు నేము మాపుదాఁకా మానుమంటే మానఁబొయ్యీనా చ. నరహరి రక్షణమే నడచీని లోకము యిరవై నేము రక్షించే దేఁటిదయ్య పొరలే గర్వ మింతే బూతులసంసారము మరలి నేమూరకుంటే మానఁబొయిన్యానా చ. సృష్టికిఁ గురైనవాఁడు శ్రీవేంకటేశు డింతే