పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

346 చ. చెలఁగి వరాలిచ్చేవు శ్రీవెంకటనాథుఁడా తలఁకక నిన్నుఁ గొల్చే దాసులకు అలరి నీవై తేను ఆశకుండవూఁ గావు నెలవైన నీసుద్దులు నీకె తెలుసు రేకు: 0358-02 గుండక్రియ సంపుటము: 04-340 పల్లవి: ఎన్నిటికెన్నిటికని యొక్కడఁ దగిలెదము మన్నించు దేవ మాకుఁజాలు చ. ముఖరమై మాఁకులకు మొదలఁబోసిననీరు శిఖలకుఁ దనువెక్కి చిగిరించినయట్టు నిఖిలప్రయోజనాలు నీమూలమేకాన మఖపతి మీసేవే మాకుఁజాలు చ. వరుసలనిన్నిటా వన్నె బంగారమే పరపరివిధముల పలుసామ్ములైనట్లు నిరతిఁ గర్మఫలాలు నీమూలమేకాన మరుగురుఁడవు నీవే మాకుఁజాలు చ. వెలయ శ్రీవేంకటేశ వివిధజంతువులకు అలవిలేనిభూమే యధారమైనట్లు నెలవు దేవతలకు నీవేలికవుగాన మలసి నీశరణమే మాకుఁజాలు రేకు:0172-05 దేసాళం సంపుటము:02-354 పల్లవి: ఎన్నిపాట్లఁ బడ్డాను యెవ్వరికిఁ జెప్పినాను పన్ని నీముద్రలఁగాక పాపము వోయినా చ. కందువ నీపాదాలపైఁ గట్టిపెట్టినఁ గాక సందులుదూరే మనసు చక్కనుండీనా నిందలేక యేపొద్దు నిన్నే కొలిచినఁ గాక త్రుందుడుకు నీమాయ తొలఁగిపోయినానా చ. వుడివోని రుచులు నీకొప్పగించినఁ గాక బడిఁ బంచేంద్రియములు పాయనిచ్చీనా జడియక నే నీకు శరణుచొచ్చినఁ గాక వొడలిలో కామక్రోధా లుడిగిపోయినానా చ. నిక్కపు నాకర్మములు నీకొరకునైనఁ గాక యిక్కడ నేఁ జేసేటి హింస మానీనా పక్కన నలమేల్మంగపతివి శ్రీవేంకటేశ అక్కర నీకు మొక్కక అజ్ఞానము వోయీనా రేకు: 0330-06 హిందోళవసంతం సంపుటము: 04-177 పల్లవి: ఎన్నిమహిమలవాఁడె యీ దేవుఁడు కన్నులపండువులెల్లాఁగదిసినట్టుండెను చ. పోలింప కర్పూరకాపు పురుషోత్తమునికి యేలీల నుండెనని యెంచి చూచితే పాలజలనిధిలోనఁ బవళింపగా మేన మేలిమిమీఁగఁడంటిన మెలుపుతో నుండెను చ. తట్టుపునుఁగు కాపు దైవశిఖామణికి యెట్టుండెనని మరి నెంచి చూచితే చిట్టకాన రేపల్లెలో చీఁకటితప్ప సేయఁగా అట్టె రాత్రులు మేననంటి నట్టుండెను చ. అలమేలుమంగతోడ నట్టే సామ్మ ధరించఁగ