పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

345 పె.అ.రేకు:0056-01 శుద్ధవసంతంసంపుటము: 15-317 పల్లవి: ఎన్ని లేవు యీ యింద్రజాలములు యెట్టు నమ్మెడిది వో సర్వేశ్వర మన్నించి నన్నిటు భోధింపఁ గదవె మాయాతీతుఁడ విన్నిటను చ. తామసునకుఁ బుట్టిన సుజ్ఞానము తత్త్యవాదమునకే మొదలు కాముకునకుఁ దోఁచిన వివేకము కాంతాళములకే శెలవవును పామరునకుఁ బొడమిన వైరాగ్యము పరదూషణకే పని యవును సామాన్యున కటు వచ్చిన చదువులు సాధింపవు మోక్షముతెరువు చ. జగతి నాస్తికున కొదవిన సత్యము శపథంబులకే గుఱి యాను మగటిమి దుర్జనుఁ డెఱిఁగిన మంత్రము మారణాదులకే సాధనము పగటున లోభి యొనర్చిన పుణ్యము ప్రత్యవాయముల కాలయము వెగటుఁన క్రూరుఁడు చేసిన తపమది వీరిడితనముల కాకరము చ. సరిఁ బాపికిఁ గల దాక్షిణ్యము జారచరులకు సహాయము విరసవర్తనున కాచార మబ్బిన విపరీతఁబులే దొరకొనును దురితచిత్తునకుఁ జిక్కిన యుక్తులు తుచ్ఛంబులపాలుగఁ జేయు చిరముగ శ్రీవేంకటేశ మిమ్ముఁగొలి చినవారలే యిల నతిఘనులు రేకు: 0246-03 హిందోళవసంతం సంపుటము: 03-262 పల్లవి: ఎన్నికై శ్రీవేంకటేశుఁ డితడు గలుగఁగానె అన్నిటా నందరిలోని అజ్ఞానాలుఁ బాసెను చ. సకలశాస్త్రములందు సందేహమే కాని వొకరు దైవమహిమ కొడఁబడరు అకటా బాస చేసినయందుకైనా నమ్మరు వికలచిత్తులెల్లాను విష్ణుదాస్యమునకు చ. గక్కనఁ గర్మము చేసి కడు నలయుటే కాని వొక్కమాటు హరిఁ బాడ నొడఁబడరు తక్కక పెద్దలుగాఁగ తల వణఁకుటే కాని పుక్కటికాండ్లు హరిఁ బూజించనేరరు చ. చిత్తములో వివేకించి చింతఁ బొరలుటే కాని వొత్తి హరిపై భార మొప్పగించరు హత్తిన శ్రీవేంకటేశుఁ డటే దయ దలఁచఁగా మత్తిలి ప్రపన్నులెల్లా మరేమిటాఁ దప్పరు చి.ఆ.రేకు:0007-05 నాట సంపుటము: 10-041 పల్లవి: ఎన్నిచేఁత లెన్నిగుణా లెన్నిభావాలు యిన్నేసి నీమహిమ లివి నీకె తెలుసు చ. యేమిలీలలు నటించే వేమయ్యా దేవుఁడా భూమిలో జీవుల నెల్లఁ బుట్టింపుచు ప్రేమతో నాటలాడేపిన్న వాఁడఁవూఁ గావు నీమహిమ లిన్నయూ నీకె తెలుసు చ. యెంతని పరఁదుకొనే విందిరానాథుఁడా అంతరంగములనుండె అందరిలోన వింతలు లేవు నీకు వెట్టివాఁడవూఁ గావు యింతేసి విచారాలు యివి నీకె తెలుసు