పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

344 చ. గోవిందాయని కొలిచిన నిన్నే శ్రీవల్లభుఁడని చింతింతును భూవిభుఁడవు యిది పునరుక్తనకుమీ దైవ మొకఁడవే ధరణికిఁ గాన చ. పరమాత్ముఁడవని భక్తి సేసి నిను నరహరివని ధ్యానము సేతు సరవులఁ జర్విత చర్వణమునకుమీ అరయఁగఁ గురి యంతరాత్మవు గాన చ. సరుగ శ్రీవేంకటేశ్వర నీదాస్యము మరిగితె నదె ముమ్మాఁటికిని త్రిరిగినయందె త్రిలిగెదననకుమీ యిరవుగ నితరం బిఁకలేదు గాన రేకు:0046-05 శ్రీరాగం సంపుటము: 01-284 పల్లవి: ఎన్ని భాధలఁబెట్టి యేఁచెదవు నీవింక నెంతకాలముదాఁకఁ గర్మమా మన్నించుమనుచు నీ మఱఁగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా చ. ప్రతిలేని దురితములపాలు సేయక నన్నుఁబాలించవైతి వో కర్మమా తతితోడ నాత్మపరితాపంబుతోడుతను తగులేల సేసి తోకర్మమా జితకాలములకుఁగాని చేతికిని లోనయి చిక్క వేకాలంబు కర్మమా మతిహీనులైనట్టిమాకు నొకపరిపాటిమార్గంబు చూపవో కర్మమా చ. ఆసలనియెడితాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదే కర్మమా వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకు వో కర్మమా కాసుకనుఁ గొరగాని గతిలేని పనికిఁగా కాలుఁదనీవేల కర్మమా వోసరించొకమారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలఁగుమీకర్మమా చ.తిరువేంకటాచలాధిపునిమాయలచేతదేసలఁదిరిగినయట్టికర్మమా హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా వరుస నేనుగమీఁదవాని సున్నంబడుగవచ్చునా నీకిట్లఁ గర్మమా పరమపురుషోత్తముని భ్రమతఁబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా రేకు:0005-03 గౌళ సంపుటము: 01-031 పల్లవి: ఎన్ని లేవు నా కిటువంటివి కన్నులెదుట నిన్నుఁ గనుగొనలేనైతి చ. అరయు నేఁజేసిన యపరాధములు చూచి కరుణించి వొకడైనాఁ గాచునా కరచరణాదులు కలిగించిననిన్నుఁ బరికించి నీసేవాపరుఁడ గాలేనైతి చ. యేతరినై నేనెఱిగి సేసినయట్టిపాతక మొకఁడైనా బాపునా ఆతుములోనుండి యలరి నీవొసఁగినచేతనమున నిన్నుఁ జెలఁగి చేరనైతి చ. శ్రీవేంకటేశ నేఁ జేసినయితరులసేవ కొకఁడు దయసేయునా నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ నీవాఁడ ననుబుద్ధి నిలుపనేరనైతి