పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

350 పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు శరణంటే నితని చరణాలే దిక్కు రేకు:0191-04 బౌళి సంపుటము:02-465 పల్లవి: ఎఱుఁగుటకంటే నెఱఁగమే మేలు మఱి తెలివికంటే మఱుపే శుభము చ. లంపటా లెఱ(గము లవలవ లెఱ(గము పంపుల బాల్యమే పరిణామము OుOపులు నెఱఁగము యెగులు నెఱ(గము జంపుల నిదురే సకలసౌఖ్యము చ. ఆస లివెఱఁగము అలమట లెఱఁగము మూసిన గర్భమే మును సుఖము వాసులు నెఱఁగము వOతులు నెఱఁగము వేసట పుట్టని విధమే సుఖము చ. పాపము లెఱ(గము బంధము లెఱఁగము శ్రీపతి దాస్యమే శేఖరము యేపున శ్రీవేంకటేశ్వరు శరణమే తీపులు మఱపేటి దివ్యానందము రేకు:0194–02 దేసాక్షి సంపుటము:02-481 పల్లవి: ఎఱుఁగువా రెరుఁగుదు రీయర్థము యొఱఁగనివారి కిది యొఱఁగనియ్యదు చ. మొదలఁ గలుగువాఁడే ముందరనుఁ గలవాఁడు అదన నాతఁడే పరమాత్ముఁడు యెదుటఁ గలిగినదే ఇన్నిటాఁ గలిగినది పదపడి యిదియే ప్రపంచము చ. చెడనిదానికి మరి చేటెన్నఁడును లేదు జడిగొన్నదిదియే సుజ్ఞానమార్గము వుడివోఁ గల దెన్నఁడు వుడివోఁ గలిగినదీ కడగడనే తిరుగు కర్మమార్గము చ. యెంచి తొల్లి నడిచేవే ఇపుడును నడచేవి మంచి శ్రీవేంకటేశ్వరు మహిమ లివి అంచ నిపుడు గానని వల్లనాఁడుఁగాననివే మంచువంటి విషయపు మూయూవాదములు చి.ఆ.రేకు:0010-01 దేసాళం సంపుటము: 10-055 పల్లవి: ఎఱుక గలిగితేను యీతఁడె దిక్కు మఱి నిమిష మీతని మానివుండఁదగునా చ. యెవ్వరిసామ్మగుడిచి యెవ్వరిగుట్టాలవెంట కొవ్వుదీరఁ బారాడి కొలిచేది యివ్వలఁ బుట్టించి పెంచి యేలిన దేవుఁ డుండఁగా ఆవ్వ లివ్వలివారిని ఆసపడఁ దగునా చ. తానెవ్వరికి బుట్టి తలఁకక వూరివారి నానందాన అయ్యలమ్మలనుకొనేది పానిపట్టి సర్వవిధబంధుఁడు విష్ణఁడుండఁగా మానిసిచుట్టరికాలు మరుగగ జెల్లునా చ. యెందువంకనో యీదేహి యేమిటినో పొగడుచు విందువలె నెవ్వరిని వెట్టిఁజేసేది