పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

341 తనుమద మెంతయిన తపముఁ జేయనీదు ఘనసంసారమదము కలుషముఁ బాయనీదు మనెడి నా మనువెల్ల మదము పాలాయ చ. పొంచి కామాంధకారము పుణ్యము గానఁగనీదు కంచపు జన్మపుచిక్కు గతి చూపదు పెంచి యజ్ఞానతమము పెద్దల నెరఁగనీదు చించరాని నా బుద్ధి చీఁకటి పాలాయ చ. శ్రీవేంకటేశ్వరు మాయ చిత్తముఁ దేరనీదు యేవంకా నీతఁడే గతి యిన్నిటా మాకు యే వుపాయమును లేక యీతని మఱఁగు చొచ్చి దేవుఁ డంతర్యామియని తేజముఁ బొందితిమి రేకు:0117-06 లలిత సంపుటము: 02-102 పల్లవి: ఎన్నఁడొకో బుద్దెరిఁగి యీడేరేది జంతువుల యిన్నిటా నీమహిమలు యెదిరించి వున్నవి చ. కావించి నీపాదతీర్థగంగ ప్రవాహమైనది పావనులై యిందరిని బ్రదుకుమని లావుగా నీప్రసాదతులసి నారువోశున్నది వేవేలు పాతకాలెల్ల విదళించుమనుచు చ. చింతల నీమూర్తులు శిలాశాసనాలైనవి పంతముతోఁ గొలిచిట్టె బ్రదుకుమని బంతినే నీనామములు ప్రతిధ్వనులై వున్నవి దొంతులైన భవముల తుద గనుమనుచు చ. అందరికి నీసేవలు హస్తగతాలై వున్నవి బందె దీర నీకు మైుక్కి బ్రదుకుమని అందపు శ్రీవేంకటేశ అంతరాత్మవై వున్నాఁడవెందు చూచిన విజ్ఞాన మింద కొండో యనుచు రేకు:0250-02 దేవగాంధారి సంపుటము: 03-285 పల్లవి: ఎన్నఁడొకో బుద్దెరిఁగి యీడేరేది జంతువులు యిన్నిటా నీమహిమలు యెదిరించి వున్నవి చ. కావించి నీ పాదతీర్థగంగ ప్రవాహమైనది పావనులై యిందరిని బ్రదుకుమని లావుగా నీ ప్రసాదతులసి నారువోశున్నది వేవేలు పాతకాలెల్ల విదలించుమనుచు చ. చెంతల నీమూర్తులు శిలాశాసనాలైనవి పంతముతోఁ గొలిచిట్టె బ్రదుకుమని బంతినే నీనామములు ప్రతిధ్వనులై వున్నవి దొంతులైన భవముల తుద గనుమనుచు చ. అందరికి నీసేవలు హస్తగతాలై వున్నవి బందెదీర నీకు మొక్కి బ్రదుకుమని అందపు శ్రీవేంకటేశ అంతరాత్మవై వున్నాఁడవెందు చూచిన విజ్ఞానమింద కొండో యనుచు రేకు: 0379-02 బౌళి సంపుటము: 04-460 పల్లవి: ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను చ. హేయములో సుఖము యొంగిలిలో సుఖము