పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

342 కాయము నమ్మికదా కష్టపడెను పాయములో చవులు పాపములో చవులు మాయలు నమ్మికదా మనసూనిట్టాయను చ. కల్లలోని బదుకు కాసు వీసపు బదుకు కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను యెల్లి నేఁటి తలఁపు యింద్రియాల తలఁపు కొల్ల సంసారముఁగూడి గుణమునిట్టాయను చ. అంగడిఁబెట్టే సిరులు యలయింపులో సిరులు దొంగజీవుఁడు యిటూనే తొట్రుపడెను అంగపు శ్రీవేంకటేశుఁడంతలో మన్నించంగాను ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెను రేకు: 9022-04 ముఖారి సంపుటము: 04-543 పల్లవి: ఎన్నటి కెవ్వరికితఁడే అన్నిటానున్న అధికుఁడు చ. ఆతుమ కంతర్యామీ స్వామీ యేతరినైనా నితఁడే పాత్రక శూరుఁడు పారశరీరుఁడు పూతన ప్రాణ ఘూతకుఁడు చ. అక్కర దీరచ నందాఁ జెందా యొక్కడనైనా నితఁడే పుక్కిటి లోకాలు పొందుగా నించి మా దిక్కైనా పరదేవుఁడు చ. నేరమి నేరుపు నించాఁ బెంచా నేరీతినైనా నితఁడే కారుణ్యనిధి వేంకట విభుఁడు మా చేరువై యున్న చెలువుఁడు రేకు: 0142-06 లలిత సంపుటము: 02-188 పల్లవి: ఎన్నటికి జీవుఁడిఁక నీడేరేది పన్నుకొనేటి చింతలే బలిసీఁ గాని చ. కలరు వివేకులు కలదిటు ధర్మము కలఁడు దైవము నేఁడు గావలెనంటే వలవని సందేహాన వట్టిజాలిఁ బొరలేటితలపోఁత లేమిటికో తడఁబడీఁ గాని చ. వున్నవి వేదశాస్త్రాలు వున్నది విశ్వాసము వున్నవాఁడాచార్యుఁడు వుపదేశించ తన్నుఁ దానే మోసపోయి తత్త్యము నిశ్చయించక మిన్నక చంచలమేలో మెరసీఁ గాని చ. యివిగో పుణ్యనిధులు యిదిగో సంకీర్తన వివరింప వీఁడిగో శ్రీవేంకటేశుఁడు భవములచే భ్రమసి బహుసంగతులచేత యివల నామనసిప్పు డెఱిఁగీఁ గాని చి.ఆ.రేకు:0001-03 దేసాక్షి సంపుటము: 10-003 పల్లవి: ఎన్నటికి నీకు జీవుఁడా యిదియె బుద్ధి వోజీవుఁడా మన్నించిన నీగురువులపాదము మఱవకువో వోయిజీవుఁడా చ. మాటచెప్పెఁద జీవుఁడా మారు మాఁటలేటికి జీవుఁడా