పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

340 మనసా అతని దివ్యమహిమెంచవో త్రనువా శ్రీపతితీర్థ దాహమే కోరవో యెనలేని అడియాస లేఁటికి నీ కిఁకను చ. వీనులాలా యేపొద్దు విషుకథలే వినరో ఆనిన చేతులితని కంది మొక్కరో కానుక చూపులాల కమలాక్షుఁ జూడరో యీనేటి పాపాలబారి నేల పడేవిఁకను చ. నలిఁ బాదాలాల హరినగరికే నడవరో కలభక్తి యూతనిపై ఘటియించవో చలమా శ్రీవేంకటేశు సంగతినే వుండవో యెలయింపుఁగోరికల కేల పారే విఁకను రేకు:0260-06 బౌళి సంపుటము: 03-348 పల్లవి: ఎన్నఁడుఁ దీరవు యీ పనులు పన్నిన నీ మాయ బహుళంబాయ చ. పెక్కు మతంబుల పెద్దలు నడచిరి వొక్క సమ్మతై వొడఁబడరు పెక్కుదేవతలు పేరు వాడెదరు తక్కక ఘనులము తామేయనుచు చ. పలికెటి చదువులు బహుమార్గంబులు కలసి యేకవాక్యత గాదు చ(చ?)లవాదOబులు జనులును మూనరు పలు తర్కంబులె పచరించేరు చ. శరణాగతులకు శ్రీవేంకటేశ్వర తిరముగ నీవే తీర్చితివి పరమవైష్ణవులు పట్టిరి వ్రతము యిరవుగ నాచార్యు లెరుఁగుదురు రేకు:0352-06 కాంబోధి సంపుటము: 04-308 పల్లవి: ఎన్నఁడొకో నే నీచెరఁ దగులక అన్నిటా శ్రీపతికాధీనమాట చ. దేహాథీనము తిరిగేటి జీవులు దేహము యర్ధాధీనము మోహాధీనము మంచినయర్థము ఆహా యిది పుణ్యాధీనము చ. సతతముఁ బురుషుఁడు సతులయాధీనము అతివలు వయసుకు నధీనము గతియగు వయసులు కాలాధీనము అతిశయమిది మాయూధీనము చ. దైవాధీనము తగినజగ మిది దేవుఁడు మోక్షాధీనము చేవల మోక్షము శ్రీవేంకటపతి - సేవాధీనము సిలుగే లేదు రేకు:0205-06 దేవగాంధారి సంపుటము: 03-030 పల్లవి: ఎన్నఁడొకో నేఁ దెలిసి యొక్కుడయి బ్రదికేది పన్నిన నా గుణమెల్లా భ్రమత పాలాయ చ. ధనమద మిదె నన్ను దైవము నెఱగనీదు