పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

339 దావతిఁ బొరలుచు వేపరుచుండేటి తగని జడుడనయ్యా నేను కైవశమై యీ దేవుఁడే యిటు ననుఁ గరుణింపుచు రక్షింపుచునుండఁగ పూవునుఁ బరిమళమును వలనే నే పొదలుచునుండెదనయ్యా నేను రేకు: 0358-05 ఆహిరి సంపుటము:04-343 పల్లవి: ఎన్నఁడు విజ్ఞానమిఁక నాకు విన్నపమిదె శ్రీవేంకటనాథా చ. పాసినఁ బాయపు బంధములు ఆస దేహమున్నన్నాళ్ళు కోసినఁ దొలఁగవు కోరికలు గాసిలి చిత్తముగలిగినన్నాళ్ళు చ. కొచ్చినఁ గొరయవు కోపములు గచ్చులగుణములుగలనాళ్ళు తచ్చినఁ దలఁగవు తహతహలు రచ్చల విషయపురతులన్నాళ్లు చ. వొకటికొకటికిని వొడఁబడవు అకట శ్రీవేంకటాధిపుఁడ సకలము నీవే శరణంటే యిఁక వికటములణఁగెను వేడుకనాళ్ళు రేకు:0236-01 వరాళి సంపుటము: 03-204 పల్లవి: ఎన్నఁడు వివేకించే దీడేరె దెన్నఁడు యెన్నిలేవు జీవిపాట్లేమి చెప్పే దిఁకను చ. నరజన్మమునఁ బుట్టి నానాభోగాలు మరిగి హరి నెరఁగక మత్తుఁడై వుండును సురలోకము చొచ్చి సుకృతి ఫలములంది గలిము విజ్ఞానమార్గము విచాలిOచఁడు చ. పెక్కుగాలము బ్రతికి పెనుఁగోరికలే కోరి అక్కడ విషుఁ గొల్వక అలసుఁడౌను మిక్కిలిఁ దపముచేసి మించైనఘనత కెక్కి తక్కక పరమమైన తత్త్వము దెలియఁడు చ. వేవేలుబుద్దులు నేర్చి వేడుక సంసారియై శ్రీవేంకటేశుఁ జెందక చింతఁగుందును దైవ మాతఁడే దయదలఁచి మన్నించుఁగాని భావించి తనంతనైతే భవములఁ బాయఁడు రేకు: 0303-02 దేశాక్షి సంపుటము: 04-014 పల్లవి: ఎన్నఁడుఁ జెడనియూవు లిచ్చీని మాధవుఁడు పన్నినయాస లితనిపైపై నిలుపవో చ. కొననాలుకా హరిగుణములే నుడుగవో