పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

338 కైవశమై నీవు గలిగుండఁగా నీవే కృపసేసి నేఁడిటుగావకున్న పావనమైన యీ పదవెందుఁగదు రేకు:0096-06 మలహరి సంపుటము: 01-482 పల్లవి: ఎన్నఁడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే సన్నము దొడ్డునుఁ దోఁచీ సంసారఫలంబు చ. తిత్తితో నూరేండ్లకును దేహము పండఁగఁ బండఁగ చిత్తం బెన్నఁడు పండక చిక్కెను కసుఁగాంమై పొత్తుల పుణ్యముఁ బాపము పులుసును తీపై రసమున సత్తు నసత్తునుఁ దోచీ సంసారఫలంబు చ. వెదవడి పుత్రులు పౌత్రులే విత్తులు లోలో మొలచియు పొది గర్మపుపూ మారదు పూపిందెయున దిదే తుద నిదె సుఖమును దుఃఖము తోలును గింజయి ముదురుక చదురము వలయము తోఁచీ సంసారిఫలంబు చ. వినుకలిచదువుల సదలో వేమరు మాఁగఁగ బెట్టిన ఘనకర్మపుటొ గరుడుగదు కమ్మర పులిగాంమై మనుమని శ్రీవేంకటేశుకు మహి నాచార్యుఁడు కానుక చనవున నియ్యఁగ వెలసెను సంసారఫలంబు రేకు:0212-05 సామంతం సంపుటము: 03-071 పల్లవి: ఎన్నఁడు మంచివాఁడ నయ్యేను నేను నన్ను నీవే మన్నించి నడుపవే దయివమా చ. వేపమానికిని చేఁదు విడువక వుండేది యే పొద్దు సహజమే యెంతైనాను పాపపుణ్యలంపటానఁ బరగి వుండేటి నేను చాపలదురుణి నౌట సహజమే చ. పాముకు విషమెప్పుడు పండ్లఁ బెట్టుకుండేది భూమిలో సహజమే పొరి నెంతైనా కామక్రోధుఁడ నాకుఁ గరుణ యించుక లేక సామజపు దుర్మదము సహజమే చ. అటుగాన శ్రీవేంకటాధిప నాకిఁక వేరే తటుకన నేఁడు శాంతము వచ్చీనా ఘటన నీ కృపయందు గలిగిన మేలు నాపై తటుకన ముంచి నన్ను దరి చేర్పవే రేకు:0215-01 గుజ్జరి సంపుటము:03–085 పల్లవి: ఎన్నఁడు మానవు యీ ಮಿಲ್ಖುಣಮಿಲು యేది అవుషదము యిందుకును కన్నులఁ జూచుచుఁ జెవుల వినుచు నేఁగనియు వినియునిదె కష్టుడనయ్యా నేను చ. హృదయము లోపల దేవుఁడుండఁగా నెఱఁగక భ్రమయుచుఁ గన్నచోటనే వెదకియుఁ గానక అనుమానించేటి వేఁదురనయ్యా నేను చెదరిన జననము దుఃఖరూపమని చెప్పగ విని యది సుఖమని కోరుచు మది దీపము వట్టుక నూతఁబడిన మత్తునివలెనయ్యా నేను చ. పరమగురువులదె భక్తిమార్గమిటు ప్రాణులకెల్లనుఁ బెట్టి వుండఁగా విరసపు టింద్రియమార్గములఁ దిరుగు వీరిడినయ్యా నేను దరి చేర్పఁగ హరినామము గలిగియు దైన్యము నొందితి సంసారములో పరుసము చేతఁబట్టుక తిరిసేటి బ్రాంతునివలెనయ్యా నేను చ. శ్రీవేంకటపతి యెదుట నుండఁగా సేవింపఁగ సంసారములోపల