పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

337 చ. విడువని జన్మములు వెంటనే వచ్చీ తడవేటి మోక్షము దవ్వాయ యెడపక శ్రీవేంకటేశ నీ మఱఁగు బడిఁ జొచ్చితి నా భారము నీది పె.అ.రేకు:0008–05 కొండమలహరి సంపుటము: 15-048 పల్లవి: ఎన్నఁడు దేవుని గనే మెన్నఁడు బుద్దెఱిఁగేము తన్నుఁదానే హరి మమ్ము దయఁ జూచెఁ గాకా చ. మాటాడు టొక్కటే కాని మాకునుఁ బసులకు చాటువఁ బంచేంద్రియాలు సర్వసమమే గాటానఁ జరియించుటే కాని రాళ్ళకును మాకు యీటులేని భవబందా ఎన్నియును సమమే చ. దొడ్డదేహ మింతే కాని దోమలకు మాకును జడు లేని జీవాత్మ సర్వసమమే ఒడ్డిన రుచు లెఱుఁగు దొడ్డవిశేషమే కాని యెడ్జెతనము మాకైతే నీజంతుసమమే చ. చేరి చదువుటేకాని చిలుకలకు మాకును సారెకు నక్షరములు సర్వసమమే యీరీతి శ్రీ వేంకటేశుఁడిటు నన్నుఁ గా చెఁ గాక నేరమి యిన్నాళ్ళు నాడేనే నిందరి సమమే రేకు:0215–04 బౌళి సంపుటము: 03-088 పల్లవి: ఎన్నఁడు నే నిఁక బుద్దెరిగేది యీశ్వర నిను నేఁ దగిలెడిది విన్నప మిదియే నీకే భారము వీని గెలువ నా వసమానా చ. తగిలెడి నీ నయనేంద్రియములు తగఁ జూచిన యందెల్లను తగిలెడి నీ శ్రవణేంద్రియములు తగిన లోకవార్తలకెల్లా మగుడఁగ నేరవు జన్మజన్మముల మనసు వీనికే సహాయము తెగ వెన్నటికిని యింద్రియసంపద తీగెలు సాగుచు నొకటొకటి చ. యెక్కెడిని నానాఁటికి మదమెంతైనా నజ్ఞానమున యొక్కెడి నీసంసారమే హరి యెదుటనే మత్తాయి గొన్నట్లు చిక్కడెంతయిన మోక్షమార్గమున జీవుఁడిందుకే లోలుఁడు దిక్కమెకమువలెఁగిందికి మీఁదికిఁ దిప్పెడిఁ గర్మము దేహమును చ. మెఱయుచుఁ బెరిగెడి నీయూసలు గడు మీఁదమీఁద లంపటమగుచు మఱియునుఁ బెరిగెడి పుణ్యపాపములు మలసి రాసులై పెక్కగుచు యెఱఁగను శ్రీవేంకటేశ్వర యెంతో ఇఁక నా లోపలి దుర్గ(రు?ణములు మఱఁగుచొచ్చితిని నేనిన్నాళ్లకు మరి నాభాగ్యము నీచిత్తము రేకు:0359-05 బౌళిరామక్రియ సంపుటము: 04-349 పల్లవి: ఎన్నఁడు నేఁగందు నిందు నిందిరాపతి నీవే కన్ను లెదుటనుండి కరుణింతుగాక చ. పొడమినయట్టె నిన్ను పొంచికొలిచేనంటే కడు నాకప్పుడు వివేకము చాలదు అడరి యంతటిమీఁదనైనాఁ దెలియఁబోతే వడి జవ్వన మదము వశమిందుగాదు చ. వెనక నేఁ బ్రౌడనై విరతిఁ బొందేనంటే ధనవాంచ నేమియుఁ దడవనీదు తనువు ముదిసి నీకుఁ దపముస్సేసేనంటే వోనర నేమిటికి వోపికలేదు చ. శ్రీ వేంకటేశ యీ సిలుగులఁబెట్టనేల