పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

333 చ. భావించఁగ నొకబ్రహ్మాండంబే జీవరాసులే సేసలివే శ్రీవేంకటేశుఁడు సృష్టించినవాఁడు యీ విధిఁ గని మను టెన్నఁడో కాని రేకు:0066-05 శుద్దవసంతం సంపుటము:01-344 పల్లవి: ఎదుటినిధానము వెటుచూచిన నీ– వదె వేంకటగిరియనంతుఁడా చ. సాగిసి భాద్రపదశుద్ధచతుర్ధశి తగువేడుక నిందరు గొలువ పగటుసంపదలు బహుళ మొసఁగు నీ వగు వేంకటగిరియనంతుఁడా చ. తొలుత సుశీలకు దుశీలవలన వెలయ సంపదల విముఖCడవై వలెనని కొలిచిన వడిఁ గాచినమూ - యల వేంకటగిరియనంతుఁడా చ. కరుణఁ గాచితివి కౌండిన్యుని మును పరగినవృద్ధబ్రహ్మఁడవై దొరవులు మూవులు ధ్రువముగఁ గాచినహరి వేంకటగిరియనంతుఁడా పె.అ.రేకు : 0038-01 సాళంగనాట సంపుటము: 15-213 పల్లవి: ఎదురా రఘుపతికి నీ విటు రావణా నేఁ డిదేమి బుద్ధి దలఁచి తిట్లాయె బ్రదుకు చ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనఁగ విరసమై కూలితివి వెట్టి రావణా వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండఁగానే సమసెఁగా కులము చ. జపతములు నమ్మి సర్వేశు విడువఁగా విపరీత్ర మూయెఁగా వెట్టిరావణా వుపమలన గడు తా నున్న జలనిధి నమ్మి కపులపాలై తివిగా కదనరంగమున చ. బంటతనము నమ్మి పైకొన్న రాఘవు 8Ꮝo&Ꭷc aᏛ8hö898ᎧᏟ❍ వెట్టిరావణా యింటనే శ్రీ వేంకటేశ్వరునిఁ గొలిచి వెంటనే సుఖియాయొ విభీషణుఁడు రేకు:0270-01 దేసాళం సంపుటము: 03-401 పల్లవి: ఎదురు లేక చరింతురెట్టెనా శ్రీవైష్ణవులు మదించి నేనుగులకు మట్టు మేర వున్నదా చ. భాగీరథిలోనఁ బాపమున్నదా పుణ్యభోగపు వేదములలో బొంకులున్నవా సాగరపుటమృతపు చవిలోఁ జేఁదున్నదా ఆగతి హరిదాసుల కపరాధ మున్నదా చ. ఆకసములోన నెరుసందునున్నదా భూమిఁ జేకొని రవియెదుటఁ జీఁకటున్నదా యీకడఁ గామధేనువు కియ్యరానివున్నవా కైకొన్న ప్రపన్నులను గలిసించ నున్నదా