పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

334 చ. హరినామమంత్రములో నౌఁగాము లున్నవా గురుకృప గలిగియుఁ గొరతున్నదా సరవి శ్రీవేంకటేశు శరణన్నవారికి విరసంబు లందులో వెదకంగఁ గలదా రేకు: 0.162-03 సామంతం సంపుటము: 02-299 పల్లవి: ఎదురుమాటలాడితి నీకు యీతప్పులు లోఁగొను నీవు పదరఁగఁ దగదు నీకు పంతములిచ్చితిఁ గావఁ గదే చ. మునుపే నే విన్నవించితిని విన నవధరించితివి నీవు వెనక వేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు ననుఁ జూచి 'దేహి యంటే 'నాస్తి' యనరాదు నీకు ఘనయాచకుఁడను నేను కడుదాతవు నీవు చ. వెదకి నిను వేఁడుకొంటిని విచ్చేసితివి మాయింటికి వదలఁదగదు నీభక్తి యొసంగు నీవాఁడను పాయకుమనుచు పదిలంబుగ మొక్కిన చేతులు బలిమిఁ గోయరాదు యిదివో బంటను నేను యేలినవాఁడవు నీవు చ. మురిగి నీ ముద్రలు మోచితిని మన్నించితివిటు నను నీవు కరుణతోడ నాయపరాధంబులు కడపు కావుమనుచు యిరవై నీపేరు వెట్టితే నియ్యకొనక పోరాదు నరమాత్రుఁడ నే శ్రీవేంకటేశ నాయకుఁడవు నీవు రేకు: 0344-01 దేసాళం సంపుటము:04-256 పల్లవి: ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ పదము లివి రెండు సంపదలు సౌఖ్యములు చ. గోపికానాధ గోవర్ధనధరా శ్రీపుండరీకాక్ష జితమన్మథా పాపహర సర్వేశ పరమపురుషాచ్యుతా నీపాదములే మాకు నిధినిధానములు చ. పురుషోత్తమా హరీ భువనపరిపాలకా కరిరాజవరద శ్రీకాంతాధిప మురహరా సురవరా ముచుకుందరక్షకా ధరణి నీపాదములె తల్లియును దండ్రి చ. దేవకీనందనా దేవేంద్రవందితా కైవల్యనిలయ సంకర్షణాఖ్య శ్రీవేంకటేశ్వరా జీవాంతరాత్మకా కావ నీపాదములె గతి యిహముఁ బరము రేకు:0217-03 పాడిసంపుటము: 03-092 పల్లవి: ఎదురేది యెంచి చూడ నితని ప్రతాపానకు పదిదిక్కులను భంగపడిరి దానవులు చ. యొక్కువగా వినోదాన కితఁడు తేరెక్కితేను యొక్కిరి దైత్యులు కొఱు లిందరుఁ గూడి చక్కఁగా నితఁడు చేత చక్రమెత్తిన మాత్రాన దిక్కులఁ బరువెత్తిరి దిమ్మరిఅసురలు చ. దట్టమై యీతని భేరిఁ దగ నాదు వుట్టితేను పుట్టె నుత్పాతాలు వైరిపురములందు అట్టె గరుడధ్వజ మటు మిన్నుముట్టితేను కిట్టి దనుజుల కపకీర్తి తుదముట్టేను