పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

332 చ. మంతన మీతఁ డాడితే మానము గోలుపాశీదురు కొంత గుఱ్ఱ మెక్కితేనే గుంటఁ గూలిపోదురు యింతటా శ్రీవేంకటేశుఁ డెక్కడఁ జూచినఁ దానే వింత ప్రతాపముతోడ విఱ్ఱవీఁగీ నిబవో రేకు: 0314-05 దేశాక్షి సంపుటము: 04-082 పల్లవి: ఎదిరికి మాకును యొక్కుడుతక్కువ లివి పదిలపుజానముచేఁ బవిత్ర మాయ చ. మహిఁ బొడమినవెల్లా మంచివే యందులోఁ దహత్రహ దేహమే తగనిది యిహములో తృణములుయెండినా యోగ్యములాయ బహి నిర్జీవపు మేను పనికిరాదాయ చ. పుడమిఁ జల్లినవెల్ల పురుషార్ధపదములే కడుపున నిడుకొంటేఁ గానివి గుడికొని యితరపు గోమయమే శుద్ది యాయ అడరి మానుషధర్మమతి హేయ మాయ చ. హరిసేవ గురుసేన నాత్మజ్ఞానమున కెక్కె పొరలింపుఁగర్మమే పుణ్యమంటెకే అరిది శ్రీవేంకటేశుడంతరాత్మకుఁ డితని శరణనుటే సర్వసాధన మాయ రేకు: 0100-02 పాడి సంపుటము: 01-502 పల్లవి: ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే వదలక హరిదాసవర్గమైనవారికి చ. ముంచిననారాయణమూర్తులే యీజగమెల్ల అంచితనామములే యీ యక్షరాలెల్లా పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి చ. చేరి పారేటినదులు శ్రీపాదతీర్ధమే భారపుయినా భూమెత నీపాదరేణువే సారపుఁగర్మములు కేశవుని కైంకర్యములే ధీరులై వివేకించి తెలిసేటివారికి చ. చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే మత్తిలి యీతనికంటే మరి లే దితరములు తి త్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి రేకు:0249-01 దేవగాంధారి సంపుటము: 03-278 పల్లవి: ఎదుటనే వున్నవి యిన్నియును యిది కైవసమగు టెన్నఁడో కాని చ. ఆకసమొకటే అల భూమొకటే లోకములు పెక్కు లోలోనే శ్రీకాంతుఁడదివో చిత్తములోననె యేకచిత్తమగు టెన్నఁడోకాని చ. యిరవగు కాలం బెప్పటి సహజమె అరుదగు దినములు అనOత్రము పరమాత్ముఁడు లోపల వెలుపల నిదె యెరవుమాని చేరు టెన్నఁడోకాని