పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

331 చ. చావుఁబుట్టువు మఱచె సంసారబOధబు, దైవమును విడిచె యూతరికంపుఁబ్రియము శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తరంజకుఁడు యిఁకఁ గావలసినది యతనికరుణ ప్రాణులకు రేకు: 0306-01 భౌళి సంపుటము:04-031 పల్లవి: ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు యిత్తల నేఁగివచ్చీని యిందిరానాధుఁడు చ. గరుడధ్వజపు తేరు కనకమయపు తేరు సిరులతో వేదములచేరుల తేరు సురలు మునులుఁ బట్టి సొంపుతోడఁ దియ్యఁగాను యిరవుగ నేఁగివచ్చీ నిందిరానాధుఁడు చ. జీవకోట్లున్న తేరు శేషుఁడే రూపైన తేరు వేవేలు సింగారముల వెలయు తేరు మూవరుస నిత్యులును ముక్తులును గొలువఁగా యీవల నేఁగివచ్చీ నిందిరానాథుఁడు చ. పంచభూతముల తేరు బ్రహ్మాండమైన తేరు మించిన శ్రీవేంకటాద్రి మీఁదటి తేరు కొంచక యలమేల్మంగఁ గూడి వచ్చీ నదె తేరు Cయోంచరాని మహిమల నిOదిరానాథుఁడు రేకు: 0173-06 నాట సంపుటము:02-361 పల్లవి: ఎత్తుకొన్న బహురూప మిఁక మరి మానరాదు చిత్తగించి మన్నించు శ్రీనరసింహా చ. పట్టి ప్రపదునికై కంబములోన నుండితివి ☾Ꮗ గట్టిగా కనకదైత్యు ఖండించితివి యిట్టి నీచేఁతలు విని యిందరుఁ గొల్బేరు నిన్ను కట్టుకొంటి వింతపని ఘననారసింహా చ. దేవతల మొరాలించి దీకొంటి వింతపనికి చేవ నభయము లిచ్చి చేయెత్తితివి దేవుఁడ వని యెఱిఁగి త్రిజగాలు మొక్కె నీకు నీవల్లనే వచ్చె నిది నిత్యనారసింహా చ. భూకాంతవిన్నపము పొంచి విని గురైతివి శ్రీకాంత తొడమీఁదఁ జేకొంటివి మీకును శ్రీవేంకటాద్రిమీఁదనే శరణంటిమి దాకొనె మీమహిమలు దండినారసింహా రేకు:0233-01 రామక్రియ సంపుటము: 03-186 పల్లవి: ఎదిరించి పాటూడ నెవ్వరితరము లిఁక త్రిదశవంద్యుఁడు హరిఁ దేరి చూడఁగలరా చ. ఘాత మీస మదరితే గగ్గులకాడవుదురు యీతఁడు దలచూపితే నెదిరించ రరులు ఆతురాన గొరిశరాయడికి నోపఁగలేరు చేతిగోరు మీటితేనే ఛిన్నభిన్నమవుదురు చ. పైపై నితఁ డడుగిడ పాతాళానఁ గుంగుదురు కోపించినంత నెత్తురుగుండాల పాలౌదురు తూపు చేత నంటితేనే తుత్తుమురై పారుదురు రాపునీలికాశ గంటే రణభీతి గొందురు