పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

330 చ. వారcణాసి వోఁజూచి వారివెంటఁ దగులుదు తేరి కొంత దవ్వ వోయి తిరుగుదును నేరిచి శ్రీవేంకటేశ నీవే నన్ను గాచితివి యీ రీతి దేరిన బుద్ధి యెందూ నే గానను రేకు:0186-03 బౌళి సంపుటము:02-434 పల్లవి: ఎట్టెనాఁ గావకపోదు యే నెంత సేసినాను యిట్టే నీకు శరణంటి నిదియే తెరంగు చ. చేకొని నే మొక్కఁగాను చేతులు గోయఁగరాదు ఆకడఁ దప్పుకుఁ దగినాజ్ఞ మానరాదు కైకొని యపరాధాలే కావించితి నెన్నెనా యీకడ నీశరణంటి నిఁకనో తెరఁగు చ. చిక్కి దైన్యపడఁగాను చెలఁగి ఖండించరాదు చక్కఁగా నాద్రోహాలు సైరించరాదు అక్కడఁ జూచిన శరణాగతబిరుదు నీకు యిక్కడ నీశరణంటి నిఁకనో తెరంగు చ. సేవసేయుచుండఁగాను జీతము మానుపరాదు యూవిధి నాన దోసితే నిందుకోరాదు దేవుఁడ నిన్నుఁ గొలిచి తెగి కర్మాలుడిగితి యీవల శ్రీవేంకటేశ ఇఁకనో తెరఁగు రేకు:0294-06 గుండక్రియ సంపుటము: 03-547 పల్లవి: ఎట్టోకో దైవమా ఇదె నీకు శరణంటి తొట్టిన నా బ్రదుకుకుఁ దుదయు లేదు చ. నాని యీజన్మమెత్తి నాటివెల్లా మఱచితి పూని యేమిటా విరతి పుట్టనేరదు కానను ముందర వచ్చే ఘనకర్మపాశములు పానిపట్టి(?)యించుకంతా భయమూలేదు చ. పంచేంద్రియములఁ జిక్కి భావమెల్లాఁ జిక్కువడె అంచెల మోక్షముతోవ అరయలేను యెంచి నాదేహములోని హేయమును సాత్మించె చంచలపు దురుణాలు చక్కనైనాఁ గావు చ. నగు సంపదల చేత నన్ను నేనే మరచితి తెగువది వివేకించఁ దీరదెప్పుడు నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలఁగాను జగమెల్లా నెరఁగ నే సాత్వికుఁడనైతి రేకు:0061-06 ఆహిరి సంపుటము: 01-315 పల్లవి: ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన గుడుసువడెఁ జదువు, మెరుఁగులు వారెఁ జలము చ. లంప మేయఁగఁదొణఁగె లలితంపుమతి లోనె, తెంపు దిగవిడిచె యెడ తెగనిమానంబు, చంప దొరకొనియె వేటలేని తమకంబు, యింపు ఘనమాయ నే నిఁకనేమి సేతు చ. బయలువందిలివెట్టు పనిలేనిలంపటము, దయ విడువఁదొడఁగె చిత్తములోనికాంక్ష, పయికొన్న మోహంబు పడనిపాట్లఁ బరచె, లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక