పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

329 చ. వొళ్ళుచెడ్డవాఁ డొకఁడు వుభయమార్గము గొని కల్లదొరపుట్టుబడి కడుఁగట్టీని చల్లని శ్రీవేంకటేశ సకలలోకపతివి యిల్లిదె నీశరణంటి మిందరిని గావవే రేకు:0161-04 లలిత సంపుటము:02-296 పల్లవి: ఎట్టు సేయఁగలవాఁడవో యిఁక నీచేతిది నావునికి నెట్టన నీదాఁసుడనై తిని నీచిత్తం బిఁకను చ. సారెకుఁ గొలువు సేతు చనవులు నీ విత్తువో యనుచు నేరకున్నాఁ బాడుదును నీవు మెత్తువనుచు వోలిచి వుపవాసములుండుదు నొగి దయదలంతువో యనుచు చేరి వాకిలి గాచుకుండుదు చిత్తము రావలెననుచు చ. కమ్మటి నిచ్చకములు నెరపుదు కైవసము గావలె ననుచు వుమ్మడి నీగుణాలు వొగడుదు వూరక మొగమోడుదు వనుచు నెమ్మది మొక్కులు నే మొక్కుదు నేరములెంచక కాతువని నమ్మి నిన్ను నేఁ బూజింతు నను నీ వీడేరింతువని చ. ఆసతో నిను భావింతు అన్నిట నన్నేలుదు వనుచు వేసరక నీమంత్రము నడుగుదు వేగమే వరమొసఁగుదు వనుచు రాసికి నెక్కఁగ శ్రీవేంకటేశా రక్షించితి విప్పుడు నన్ను వాసితోడ నే నిన్నుఁ దగులుదును వదలక నాపాలఁ గలవనుచు రేకు : 0017-04 బౌళి సంపుటము: 01-104 పల్లవి: ఎట్టుచేసినఁ జేసె నేమి సేయఁగవచ్చు చుట్టపు విరోధంబు సునాసుర్రేలిమి చ. ఒడలిలోపలిరోగ మొనరఁ బరితాపంబు కడుపులోపలిపుండు కడలేనియాస తడిపాఁత మెడగోఁత తలఁపు విషయాసక్తి గుడిమీఁదితరువు ఆలకులము ప్రాణలకు చ. నీడలోపల యొండ నెలకొన్న బంధంబు గోడపై సున్నంబు కొదలేని యెఱుక పాడూరిలో బ్రదుకు పాపకర్మపుబుద్ది తాడుపై తపసు తమధనము ప్రాణులకు చ. మంటఁజేసిన బొమ్మమనికి సంసారంబు రెంటికినిగాని వీరిడికొలువు బ్రదుకు యింటివేలుపు వేంకటేశుఁ గొలువక పరులవెంటఁ దిరుగుట వోడ విడిచి వదలిడుట రేకు:0230-01 లలిత సంపుటము: 03–168 పల్లవి: ఎట్టున్నదో నీచిత్త మెదురాడ నే వెఱతు గట్టిగా హరి నీమాయ కడవఁగరాదు చ. నిచ్చ పతితులఁ జూచి నేను సంసారినై యుందు అచ్చపు సన్యాసులఁ జూచటువలె నయ్యేనందు హెచ్చి మోచి వచ్చితేను యొక్కడిగొడవ యందు ఇచ్చట నిశ్చలబుద్ధి యెందూ నేఁగానను చ. కర్ములఁ జూచొకవేళ కర్మము నేఁ జేయఁబోదు మర్మపు జ్ఞానులఁ జూచి మంచిదందును అర్మిలి రెండూఁ జూచి అంతలో సందేహింతు నిర్మలమయిన బుద్ధి నేనెందుఁ గానను