పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

324 చ. శ్రీవేంకటేశా నీమూరితి చింతించి చేపట్టఁగలేను దేవుఁడ వనియెడు విశ్వాసమునకే తిరముగఁ గొలిచెదను శ్రీవనితాధిప వేదాలు మిమ్మనుఁ జెప్పఁగా నే తర్కింపుదును వేవేలు పరుషలు సేవింపఁగ నీవే కర్తవని నిశ్చయింతును రేకు:0045-05 సాళంగనాట సంపుటము: 01-277 పల్లవి: ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా యెట్టివారికి నింక నేది తోవయ్య చ. పాముఁజOపిన యట్టిపాతకమునఁ బెద్ద - పాముమీఁద నీకుఁ బవళించవలసె కోమలిఁ జంపిన కోఱఁతవల్ల నొక్కకోమలి నెదఁ బెట్టుకొని యుండవలసె చ. బండి విఱిచినట్టి పాతకమునఁ బెద్ద బండిబోయుఁడవై పనిసేయవలనె కొండవెల్స్లకి నట్టిగుణమునఁ దిరుమలకొండమీఁద నీకుఁ గూచుండవలసె చి.ఆ.రేకు:0009-04 దేసాళం సంపుటము: 10-052 పల్లవి: ఎట్టిహితోపదేశకుఁ డెటువంటిదయాళువు అట్టె తాళ్లపాకన్నమాచార్యులు చ. పచ్చితామసుల మమ్ముఁ బరమసాత్వికులఁగా యిచ్చటనె సేసినాఁడు యెంతచిత్తము యిచ్చగించి మాకులాన నెన్నఁడులేనివైష్ణవ మచ్చముగాఁ గృపసేసె నన్నమాచార్యుఁడు చ. ముదిరిన పాపకర్మములు సేసినట్టి మమ్మ యెదుటఁ బుణ్యులఁ జేసె నెంతసోద్యము కదిసి యేజన్మానఁగాననిసంకీర్తన మదన నుపదేశించె నన్నమాచార్యుడు చ. గడుసుఁదనపు మమ్ముఁ గడు వివేకులఁ జేసి యిడుమలెల్లాఁ బాప నేమరుదు నడుమనె యెన్నఁడుఁగానని శ్రీవెంకటనాథు నడియాలముగ నిచ్చె నన్నమాచార్యుఁడు పె.అ.రేకు:0008-04 సాళంగ నాట సంపుటము: 15-047 పల్లవి: ఎట్టు గడించె దైవము యిందరికిని సుఖము పట్టిన భ్రమవంటిది పంచేంద్రియ సుఖము చ. పచ్చివలెనో తోఁచు పండు ముక్కలు వోవు మచ్చికం గాంతలతోడి మదిన సుఖము వచ్చినట్ట నేవుండు పండ పండనట్లోను తచ్చితా తొల్లి చేసిన దాన ఫలసుఖము చ. మోవని యట్లే వుండు ములిగేపాటిభారము భావించి యెత్తుకొన్న సంపద సుఖము కైవసమైనట్లుండు కడదాకా వళకులే తేవల ననుభవించే దేహభోగసుఖము