పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

323 కక్కసించి నిను ధ్యానము సేసెద కడుసాహసుఁడఁగా నేను చ. హెచ్చిన నీ చిత్తము గానా యేచిన నా భాగ్యము దెలియా యిచ్చలనే బయలకు మొరవెట్టెద యొక్కడి కెక్కడ అసంగతం కచ్చు పెట్టి శ్రీవేంకటనాయక కరుణించితి విటు నను నీవే గచ్చుల వూరకె నిన్నుఁబొగడెదను కడుసాహసుఁడగా నేను రేకు:0099-05 మలహరి సంపుటము: 01-499 పల్లవి: ఎట్టయినా జేయుము యిఁక నీచిత్తము కిట్టిననీ సంకీర్తనపరుఁడ చ. కొందరు జ్ఞానులు కొందరు భక్తులు కొందరు వైరాగ్యకోవిదులు యిందరిలో నే నెవ్వఁడఁగా నిదె సందడి హరి నీశరణాగతుఁడ చ. జపితలు గొందరు శాస్తులు గొందరు ప్రపత్తిఁ గొందరు బలువులు వుపమించఁగ ని న్నొకఁడా గా నిందు కపురుల నీడీంగరీఁడ నేను చ. ఆచార్యపురుషులు అవ్వలఁ గొందరు యేచినసమయులై యేర్పడిరి కాచేటి శ్రీవేంకటపతి నేనైతే తాచి నీదాసులదాసుఁడను రేకు:0217-06 ఆహిరి సంపుటము: 03-095 పల్లవి: ఎట్టయినాఁ జేసుకో ఇఁక నీ చిత్తము నన్ను పట్టిచ్చె మా గురుఁడు నీ పాదాలు విడువను చ. పోడిమి నా నామములు పొద్దువొద్దు నుడిగీని వీఁడేమడుగునోయని వెఱవకుమీ నాఁడే నా యాచార్యుఁడు నాకు నన్నీ యిచ్చినాఁడు నేఁడిదేలంటే నతని నేమము నే మానను చ. ప్రేమతో వీఁడు నన్నింటఁ బెట్టుక పూజించీని యేమి గారణమోయని యెంచుకోకుమీ కామించి యాచార్యుఁడే కారణము నీకు నాకు యీ మరులేలంటే నాతఁడిచ్చిన సొమ్మే నేను చ. పలుమారు వీఁడు నాపై బత్తిచేసీ నేఁటికని వెలయ శ్రీవేంకటేశ వేసరకుమీ యెలమి నాచార్యుఁడిదే పని చేసినాఁడు నిలిచెఁ గలకాలము నీకు నాకుఁ బోదు రేకు: 0161-01 లలిత సంపుటము:02-293 పల్లవి: ఎట్టిదో మీమాయావిలాసము యెఱిఁగిన నెఱఁగనీదు అట్టె మాగురు ననుమతినే ప్రత్యక్షమవైతివిగాని చ. కరుణాకరా మిమ్మునుఁ గని తెలియఁగలేను ధర మీమహిమలు వినివిని తగ నరుదందుదును నరహరి నీవు నాలో నుండఁగ నమ్మక పురాణకథలందు అరయఁగ మీచరితలు చెప్పఁగ నాసతోడ మిముఁ దలంతును చ. జగదీశా మీనామంబులు జపించ నలయుదును వెగటుగ నీచిత్రసృష్టి చూచి మిము వెదకుదు నింతటను నగధర మీపై భక్తి సేయఁగ మనంబున వొడఁబడను పగటున మీరిచ్చు వరములకొరకే పలుమారు మీకు మొక్కుకొందును