పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

325 చ. మిక్కిలి తీపై వుండు మీసాల మీఁదట తేనె చక్కటి నానాఁటి సంసారసుఖము తక్కక శ్రీవేంకటేశదాసులకు చిక్కివుండు అక్కడ నిక్కడను బ్రహ్మానందసుఖము రేకు:0208-05 కన్నడగౌళ సంపుటము: 03-047 పల్లవి: ఎట్టు గెలుతుఁ బంచేంద్రియముల నేఁ బట్టరాని ఘనబలవంతములు చ. కడు నిసుమంతలు కన్నుల చూపులు ముడుఁగక మిన్నులు ముట్టెడిని విడువక సూక్ష్మపువీనులు యివిగో బడిబడి నాదబ్రహ్మము మోచె చ. అదె తిలపుప్పంబంత నాసికము కదిసి గాలి ముడెగట్టెడని పొదిగె నల్లెఁడే పొంచుక నాలికె మొదలుచు సర్వము మింగెడిని చ. బచ్చెన దేహపు పైపొర సుఖమే యిచ్చఁ బ్రపంచం బీనెడిని చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరుఁ దచ్చి తలఁచఁగా దరి చేరెడిని రేకు : 0031–03 ముఖారి సంపుటము: 01-190 పల్లవి: ఎట్టు దరించీ నిదె యీజీవుఁడు ಬಟ್ಟಬಯಲುಗ್( బరళ్చీ నొకటి చ. చెడనిమట్టిలోఁ జేసినముద్దే నడుమ ముంచుకొన్నది వొకటి తడియునినీరై తడివొడమింపుచు వడిసీని వేపుర వడితో నొకటి చ. పాయనితనుదీపనములుగా నటు చేయుచు మది వేఁచీ నొకటి కాయపు చుట్టరికమ్ములు చేయుచు రేయుఁబగలు విహరించీ నొకటి చ. యిన్నియుఁదానే యేచి కపటములు పన్నీ నిదె లోపల నొకటి వెన్నెలచూపుల వేంకటేశ నిను యెన్నికతోఁ గడు నెదిరీ నొకటి రేకు:0147-01 సామంతం సంపుటము: 02-211 పల్లవి: ఎట్టు దోయవచ్చు విని నెంతటివారికైనాను పట్టి నీకు శరణంటే బ్రదికింతువు గాక చ. మూలతనమువంటిది మతిఁదగులుఁ గామము అలరి ముట్టువంటిది అంటుఁగ్రోధము కేలి నొదిగించు నెంగిలివంటిది లోభము వాలాయించి నెందుండై నా వచ్చును లోకులకు చ. చుట్టి మద్యమువంటిది చొక్కించు మోహము వట్టి మాంసమువంటిది వయోమదము పుట్టిన భ్రమవంటిది పొదిగిన మచ్చరము వుట్టిపడి నోరూరించు నూరకే ప్రాణులను