పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

319 చనవుల హరిలాంఛన కాయమునకు వెనుకొను కర్మపువెట్టియు లేదు చ. శ్రీవేంకటేశ్వరుఁ జేరినధర్మికి ఆవల మఱి మాయలు లేవు కైవశమాయను కైవల్యపదమునుఁ జావుముదిమితో సడ్డెలేదు రేకు: 0109-04 సాళంగం సంపుటము: 02-052 పల్లవి: ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము తక్కక శ్రీపతి నీవే దయఁజూతు గాక చ. కాదనఁగ నెట్టవచ్చు కన్నులెదిటి లోకము లేదనఁగ నెట్టవచ్చు లీలకర్మము నీదాసుఁడ ననుచు నీమరఁగు చొచ్చుకొంటే యేదెసనైనాఁ బెట్టి యీడేరింతు గాక చ. తోయ నెట్టవచ్చు మించి తొలఁకేటి నీమాయ పాయ నెట్టవచ్చుఁ యీభవబంధాలు చేయూర నిన్నుఁ బూజించి చేరి నీ ముద్రలు మోఁచి యిూయెడ నుండఁగా నీవే యీ డేరింతు గాక చ. తెలియఁగ నెట్టవచ్చు బ్రిష్టమైన నీమహిమ తలచఁగ నెట్టవచ్చు తగు నీరూపు నెలవై శ్రీవేంకటేశ నీవు గలవనుండఁగా యిలఁమీద మమ్మునీవే యీడేరింతు గాక పె.అ.రేకు:0053-04 మలహరి సంపుటము: 15-302 పల్లవి: ఎక్కడిమాటలు యేఁటి విచారము చిక్కక హరినే సేవించవలదా చ. బొందితోఁ జేసినపుణ్యము లన్నియు గొంది( జచ్చి మఱి కుడిచేదటా కంది కుంది తా గడియించిన ధన మంది సుతులపాలయ్యేదటా చ. బిరుదుశాస్త్రమునఁ బెండ్లియాడినసతి మరలిపుట్టువున మణి వేరట పెరిమ బహుగతుల( బెంచుకొన్న తను వరయఁగఁ దనవెంట నరుగదట చ. చెలఁగి యిచ్చి యార్జించిన కీరితి పిలిచే యాజన్మపు పేరిది యట బలిమి శ్రీవేంకటపతి యంత కాత్మ గలఁడని కొరెలిచినఁ గలుగును ఫలము రేకు: 0327-05 నాట సంపుటము:04-158 పల్లవి: ఎక్కుడు బ్రహ్మపట్టాన కిదె కాచుకున్నావాఁడు పిక్కటిల్లి సంతోసానఁ బెద్దహనుమంతుఁడు చ. తూరుపుఁ బడుమరాను దొడ్డగా జOగ చాఁచి సారెకుఁ నర్కునివద్దఁ జదివీ వాఁడే ధీరతతోఁ దనమేను దిక్కులెల్లాఁ బిక్కటిల్ల బీరముచూపీ వాఁడె పెద్దహనుమంతుఁడు చ. మిన్ను నేల నేకముగా మించినవాల మెత్తి సన్నుతిగా వలకేల చాఁచినవాఁడు పన్నుగడై రాఘవునిబంట్లలోపలనెల్లా