పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

320 పెన్నిధియై యున్నవాఁడు పెద్దహనుమంతుఁడు చ. మరిగి రేయుఁబగలు మతంగపర్వతమాడ బిరుదులతోడను బెరసీ వాఁడే యిరవై శ్రీవేంకటేశుహితుఁడై యొప్పుడుఁ బెచ్చు– పెరుగుచు నున్నవాఁడు పెద్దహనుమంతుఁడు రేకు:0062-03 సామంతం సంపుటము: 01-318 పల్లవి: ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైన నిక్కమెరిఁగిన మహా నిత్యుఁడే ఘనుఁడు చ. వేదములు చదివియును విముఖుఁడై హరిభక్తి యూచరించని సారీ మయూజికంటె యేదియునులేని కులహీనుఁడైనను విష_ పాదములు సేవించు భక్తుఁడే ఘనుడు చ. పరమగువేదాంతపఠన దొరికియు సదా హరిభక్తిలేని సన్యాసికంటె సరవి మాలిన యంత్యజాతికులజుఁడైన_ నరసి విష్ణునివెదకు నాతఁడే ఘనుఁడు చ. వినియుఁ జదివియును శ్రీ విభునిదాసుఁడుగాక తనువు వేఁపుచునుండుతపసికంటె యెనలేని శ్రీవేంకటేశుప్రసాదాన్న_ మనుభవించినయాతం డప్పుడే ఘనుడు పె.అ.రేకు:0025-03 ముఖారి సంపుటము: 15-143 పల్లవి: ఎక్కువ తక్కువ లేవి యిందరిలోపల నేను చిక్కి హరి నీవు పెద్ద సేసితివి గాక చ. తెలియ నిందరివంటి దేహమే యిది గాదా పొలసి దొరతనము పొదిగీఁ గాక మలమూత్రములు రక్తమాంసము లొక్కటె కావా కలిమి లేములు ముందు కాననియ్యువు గాక చ. చేపట్టి యిందరివంటి జీవుఁడ నేఁ గానా పాపపుణ్యములు నన్ను బరచీఁ గాక యేపొద్దు లోకములోని యింద్రియము లివే కావా తీపులు మరపి నన్ను దిమ్మరేఁచీఁ గాక చ. కైకొని యిందరివంటి కర్మమే సేయఁగఁగాదా యీకడ సంపదలు నన్నేఁ బంచీఁ గాక పైకొని శ్రీవేంకటేశ భక్తి యొక్కటె కాదా యేకడనైనా నన్ను యీడేర్చుఁ గాకా రేకు:0095-01 లలిత సంపుటము: 01-471 పల్లవి: ఎక్కెఁగా రాఁగా రాఁగా యిందాఁకాఁ దగులు యిక్కువ శ్రీహరిమాయ నింకనెంతో తగులు చ. తెగనికర్మమునకు దేహము దగులు తగినదేహమునకు తరుణితో తగులు సాగిసి యారెంటికి సుతు లొక్కతగులు అగడాయఁ గనకము అన్నిటితో తగులు చ. యింతటిసంసారికి యిల్లోక్కతగులు బంతికి నందు గలిగె పాఁడిపంట తగులు చెంత నీలంపటానకు క్షేత్రము తగులు