పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

318 అరిదిఁ బ్రపంచము మాయామయమట నేము దురితవర్తనులము తొలఁగేమా చ. ఘన సిద్ధగంధర్వులు కడ గానలేరట దినమత్తులము మా తెలివేఁటిది యెనలేని శ్రీవేంకటేశ్వరు శరణుచొచ్చి మనువార మింతేకాక మరి గతియేది రేకు: 0301-01 రామక్రియ సంపుటము: 04-001 పల్లవి: ఎక్కడికంసుడు యిఁక నెక్కడిభూభారము చిక్కువాప జనియించె శ్రీకృష్ణుఁడు చ. అదివో చంద్రోదయ మదివో రోహిణిపొద్దు అదన శ్రీకృష్ణుఁడందె నవతారము గదయు శంఖచక్రాలు గల నాలుగుచేతుల నెదిరించి యున్నాఁడు ఇదివో బాలుఁడు చ. వసుదేవుఁడల్ల వాఁడే వరుస దేవకి యదే కొసరే బ్రహ్మాదుల కొండాట మదే పొసఁగఁ బొత్తులవిూదఁ బురుఁటింటి లోపల శిసువై మహిమ చూపె శ్రీకృష్ణుఁడు చ. పరంజ్యోతిరూప మిదె పాండవుల బ్రదికించె అరిది కౌరవుల సంహారమూ నిదె హరికర్ష్యము లీరో జయంతి పండుగ సేయరొ కెరలి శ్రీవేంకటాద్రి కృష్ణుఁడితఁడు రేకు:0257-01 సాళంగనాటసంపుటము: 03–326 పల్లవి: ఎక్కడిది వివేక మెంతవారికిని యిన్నియు నీమాయఁ దోయక లేదు పక్కన అజ్ఞానపుజీవుల యూపాప మిట్లనే వుండఁగను చ. విచ్చనవిడి నటు కౌరవులెదుటను విశ్వరూపు చూపినయపుడు యిచ్చల నిను నమ్మఁగలేకేకా యింద్రజాలమనిరి తచ్చన నిప్పటి నాస్తికజనులును తగు నీ సాకారము చూచి నిచ్చలుఁ గల్లని నిరాకారము నిజమని తర్కించక మానుదురా చ. గరుడవాహనము శంఖచక్రములు కనియుండియు ద్వాపరజనులు ధరలో నిను హరిమూ రైని తెలియక తమయాదవుఁ డొకఁడితఁడనిరి సరుస దేవతాంతరములఁ గొలిచేటి చంచలచిత్తులు ఇఁక నిన్నే పరదైవం బననేరరు సరిగా బ్రహ్మాదులలో నొకఁడవందురు చ. యెఱిఁగిన దాసులు యెఱుఁగుదురు నీ వెక్కుడనుచు యేకాలమును యొఱఁగని పామరు లెఱఁగరు నిను మతినెంతైనా నాఁడు నేఁడును తటితో శ్రీవేంకటేశ్వర నినుఁ గని తగు శరణాగతులున్నట్లు మఱుఁగున నుండిన ప్రాకృతులకు నీమహిమలు గానఁగఁ దరమవునా రేకు:0084-04 గుజ్జరి సంపుటము:01-408 పల్లవి: ఎక్కడి పాపము లెక్కడి పుణ్యము లొక్కట గెలిచితి మోహో నేము చ. ప్రపన్నులెదుటను బడినయూతుముకు చపలత మరి నాశము లేదు ఉపమల గురుకృప నొనరిన మనసుకు రపముల మఱి నేరములే లేవు చ. ఘనతర ద్వయాధికారగు దేహికి మినుకుల భవభయమే లేదు