పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

317 అనువై యీలంపటాన కాసలెల్లాఁ దగులు మన సాక్కటొక్కటై మాయకింతాఁ దగులు చ. అరయ శ్రీవేంకటాశుఁ డాత్మలోనే తగులు శరణన్నవారికి విజ్ఞానము దగులు గరిమ నిందువల్లనే ఘన మోక్షమూఁ దగులు మరిగినప్పుడే సుమ్మీ మాయకింతాఁ దగులు రేకు:0265-05 గుండక్రియ సంపుటము: 03-376 పల్లవి: ఎక్కడి వుద్యోగాలు నేడకెక్కు జీవునికి నిక్కిచూచి హరి గరుణించిన దాఁకాను చ. తనిసినవారు లేరు తగ నింద్రియభోగాలు పెనఁగఁ బెనఁగఁ బైపై బెరుగుఁ గాని మనసులోనికి రాదు మాటలలోని విరత్రి తునిగినట్లనుండు దొరకు దాఁకాను చ. విడిచినవారు లేరు విషయాలు సంపదలు వుడుగక కోరఁగోర నొదగుఁగాని పుడిమి విన్నట్టుండదు పుస్తకాలలో చదువు నడుమంత్రములనుండు నానినదా(కాను చ. తెలిసినవారు లేరు దేవుని నాతుమలోన పలు లంపటాలఁ బడి భ్రమనుఁ గాని యెలమి శ్రీవేంకటేశుఁ డేమిటా మెచ్చఁడు తన్నుఁ దలఁచి భక్తితోడ దగ్గరుదాఁకాను పె.అ.రేకు:0054-06 గుజ్జరి సంపుటము: 15-316 పల్లవి: ఎక్కడి వుపాయముల నే మున్నది మొక్కె నీ కొక్కనికే మూలము నీవే చ. పరులను శిక్షించి పనిగొనియెద నా సిరుల నా శరీరము శిక్షించ లేను వరుస లోకమింతాను వసముచేసుకొనేనా పరగ నా మతి స్వస్థపరచుకో లేను చ. నిక్కము నన్యదేము నే ననుభవించేనా పక్కన నా యాత్మ ననుభవించ లేను అక్కడా నిక్కడా ధన మడిగి కూడపెట్టెనా అక్కటా నా విజ్ఞాన మార్జించ లేను చ. బట్టబ్బాయిట నే దేవపట్టములు సాధించేనా యిట్టి తపోరాజ్యమేలఁగలేను నెట్టన శ్రీవేంకటేశ నీవు నన్ను నేలితివి పుట్టుగు లందేనా నీపై బుద్ధి మాన లేను రేకు:0222-05 సాళంగంసంపుటము: 03-124 పల్లవి: ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు అక్కటా వోదేహులాల హరినే తలఁచరో చ. బలుదేవతలకునుఁ బాయదట వ్యామోహము యిలపై నరులము నేమెంతకెంత కలదట మునులకుఁ గడ(డు?) రాగద్వేషాలు చలనచిత్తులము మా జాడ యిఁక నేది చ. పరగం దొల్లిటివారు పంచేంద్రియబదులట నెరవుగా ముక్తులమా నేఁటివారము