పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

316 మొక్కనేలే యెవ్వరికి మొరవెట్టనేమిటికి నిక్కపు మా యిలువేల్పు నీవై వుండఁగా చ. దగ్గరవు మాయలింక దగ్గరవు దురుణాలు నిగ్గుల శ్రీవేంకటేశ నీవు గల్గఁగా యెగులేదు తగ్గులేదు యిఁక నీదాసులలోన వుగువలె నీప్రసాద మూనినది వొడల పె.అ.రేకు:0001-07 సాళంగనాట సంపుటము: 15-007 పల్లవి: ఎక్కడి పురాకృతము యేమి సేసీని యొక్కడా బలువు నీ బంట్లెట్టుండినాఁ జెల్లును చ. నీ వల్లఁ బుట్టెను బ్రహ్మ నీవు సేసినదే మాయ భావించి నీ కుక్షిలోనే బ్రహ్మాండాలూ కావింప నీ వేలికవు కమ్మని నటౌఁ బనులు దైవమా యిది యెఱిఁగి నీ దాసుఁడనేనైతిని చ. భూమి నీ దేవులు నీవు పుట్టించిన దమృతము శ్రీమంతుఁడ విన్నిటా నీ సేసినట్టవును యేమిటివాఁడు యముఁడు యొక్కడి మృత్యువు మరి సామజవరద మీ శరణు చొచ్చితిని చ. ఏడఁ జూచినా నీ దాసు లెక్కడాఁ జెడుట లేదు యిూడు లేదు శ్రీ వేంకటేశ నీకును యేడ విధి యేడ స్వర్గ మెక్కడిది నరకము జాడతో నీముద్ర నా భుజముల ధరించితి పె.అ.రేకు:0007-01 బౌళి సంపుటము: 15-038 పల్లవి: ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తిం బిఁకనూ చ. మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము మఱవను యింద్రియభోగము మాధవ నీ మాయా మఱచెద సుజ్ఞానంబును మఱచెద తత్వరహస్యము మఱచెద నురువును దైవము మాధవ నీ మాయా చ. విడువనుఁ బాపము పుణ్యము విడువను నా దురుణములు విడువను మిక్కిలి యాసలు విష్ణుఁడ నీ మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుఁడ నీ మాయూ చ. తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపుమార్గము తలఁపున యెంతైనా అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా రేకు:0263–06 శ్రీరాగం సంపుటము: 03-366 పల్లవి: ఎక్కడి విరతి మాకు నిహమెల్లాఁ దగులు మక్కళించి మక్కళించి మాయకింతాఁ దగులు చ. పుట్టినప్పుడే పాపపుణ్యములు దగులు అట్టె దేహమున కన్నమూఁ దగులు గట్టిగా నీరెండూనైతే కర్మమూఁ దగులు యెట్టునుఁ బోరాదు మాయకింతాఁ దగులు చ. మనికి సంసారియైతే మమతలుఁ దగులు పెనగంగఁ టెనగఁగా బిడ్డలూఁ దగులు