పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

312 దొంతర సహస్రనామాదుల నెన్ని కైతివి చ. సరుగ నెవ్వరిచేత సాధింపరానివాఁడవు వొరసి నీ భక్తిచే సాధ్యుండ వైతివి సురలకు నీ గుఱుతు చూపరానివాఁడవు బిరుదులచే గుఱుతు పెట్టించుకొంటివి చ. వేదములచే నీరూపు వెదకరానివాఁడవు పాశీదితో శ్రీవేంకటాద్రిఁ బౌడచూపేవు యేదెస నీ వొక్కఁడవే యేలికైన వాఁడవు మేదిని యలమేల్మంగ మెడఁగట్టుకొంటివి రేకు: 0362-03 రామక్రియ సంపుటము: 04-365 పల్లవి: ఎక్కడ నీ వుద్యోగ మెటు విచ్చేసేవయ్యా యిక్కువ నీమహిమకు నెవ్వ రెదురయ్యా చ. పల్లించి గరుడనిపై నీ వుబ్బుననెక్క అల్లనాఁడె పారిజాత మడవికెక్కె పల్లదపురుద్రుఁడును బాణునివాకిలి దొక్కె చుల్లరి రాక్షసమూఁక సురసుర సుక్కె చ. గరుడినిపై నీవు కడుఁబేరెములవార ధరజలధరుల నమృతములు దేరె నిరతిఁ గంసాదులనెత్తురు టేరులు వారె పరులు నీకెదిరిన పగయొల్ల దీరె చ. బంగారు గరుడనిపై నీవు వీదులేఁగ చెంగట శ్రీ వేంకటేశ సిరులుమూఁగె సంగతి నలమేల్మంగ సంతసాన విఱవీగె పొంగారు దేవదుందుభులు పై పై వాఁగె రేకు:0211-04 ఆహిరి సంపుటము: 03-064 పల్లవి: ఎక్కడ నున్నారో సురలెవ్వరు భూమికి దిక్కో తొక్కులఁబడె జీవుఁడు దుండగీల చేతను చ. ఆసలనియెడి వెట్టియంగడి వెంటాఁ దిప్పె దోసిలొగ్గించె దైన్యము దొరలెదుట యీసుల నాఁకటి(లి?) విషమేమైనాఁ దినిపించె గాసిఁబడె జీవుఁడిదె కన్నవారి చేతను చ. కడుఁ గోపపు భూతము కాయమెల్లా మఱపించె వడి నజ్ఞానపు టేరు వరతఁగొట్టె నడుమఁ బాపపు చొక్కు నరకపు గుంటఁ దోసె గడుసాయ జీవుఁడిదె కన్నవారి చేతను చ. భవము సంసారపు బందెలదొడ్డి బెట్టించె తగి(వి?)లింద్రియపు తాళ్లు దామెనఁ గట్టే యివల శ్రీవేంకటేశుఁ డింతలో దిక్కయి కాచె కవడు వాసె జీవుఁడు కన్నవారి చేతను రేకు:0315-02 సాళంగనాట సంపుటము: 04–085 పల్లవి: ఎక్కడ నెదురు లేక యీరేడులొకములందు వొక్కఁడే నిలిచెనమ్మ వుగ్రహనుమంతుఁడు చ. పెట్టినజంగదండ పిడికిటి మొలచేయి అట్టె వలచేయెత్తిన యాయితము తొట్టిన పెంజమటలు తోడనె బుసకొట్టులు