పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

311 చంచలము మానవలె సతతము దేహికి చ. భ్రమయకుండఁగ వలె పడఁతులఁ గంటేను తమకించకుండవలె తన్నుఁ దిట్టితే సుముఖుఁడై యుండవలె చూచినవారికి నెల్ల అమరి యుండఁగవలె నన్నిటాను దేహికి చ. కైవశమై యుండవలె ఘనపుణ్యములకెల్ల దైవము నమ్మఁగవలె తనువెత్తితే యీవల శ్రీవేంకటేశుఁడితనికే శరణని భావించి బ్రతుకవలె పనివడి దేహికి రేకు:0201-04 దేసాళం సంపుటము: 03-004 పల్లవి: ఎక్కడ చూచిన వీరే యింటింటి ముంగిటను పెక్కుచేఁతలు సేసేరు పిలువరే బాలుల చ. పిన్నవాఁడు కృష్ణుడు పెద్దవాడు రాముఁడు వన్నె నిద్దరమడలవలె నున్నారు వెన్నలు దొంగిలుదురు వీఁడు వాఁడు నొక్కటే పన్నుగడై వచ్చినారు పట్టరే యీ బాలుల చ. నల్లనివాఁడు కృష్ణుడు తెల్లనివాఁడు రాముఁడు అల్లదివో జోడుకోడెలై వున్నారు వెల్లవిరై తిరిగేరు వేరు లే దిద్దరికిని పెల్లుగ యశోదవద్దఁ బెట్టరె యీబాలుల చ. రోలఁ జిక్కె నొకఁడు రోకలి వట్టె నొకఁడు పాశీలిక సరిబేసికిఁ బొంచి వున్నారు మేలిమి శ్రీవేంకటాద్రి మించిరి తానే తానై ఆలించి నె(యె?)వ్వరి నేమి ననకురే బాలుల రేకు:0069-04 బౌళి సంపుటము: 01-361 పల్లవి: ఎక్కడ చొచ్చడి దీభవమేదియుఁ గడపల గానము వుక్కునఁ బరితాపానల మూదక మండెడివి చ. హృదయవికారము మాన్పఁగ నేతెరఁగును సమకూడదు మదనానందము చెరుపఁగ మందేమియు లేదు పొదలినదేహగుణంబులఁ బోనడువఁగ గతి గానము బ్రదికించినకోరికెలకుఁ బ్రాయము దిరిగినది చ. కమలినయజ్ఞానం బిది కన్నులముందరం గానదు తిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదు తెమలనియూశాపాశము తెంపఁగ సత్వము చాలదు మమకారము వెడలింపఁగ మతి యెప్పుడు లేదు చ. దురితంబులు పుణ్యంబులు తొడిఁబడ నాత్మనుఁ బెనగొని జరగఁగ శరీరధారికి సత్కర్మము లేదు తిరువేంకటగిరిపతియగు దేవశిఖామణిపాదము శరణని బ్రదుకుటదప్పను సన్మార్గము లేదు పె.అ.రేకు:0068-02 నాట సంపుటము: 15-389 పల్లవి: ఎక్కడ దాఁగఁగ వచ్చు నింక నీకును పక్కన నీ దాసు లెల్లా బ్రదికిరి యింకను చ. పంతాన నెక్కడాఁ జిక్కువడని యట్టివాఁడవు చింతల నీ కథలలోఁ జిక్కుకొంటివి యెంతైనా నీ మహిమల నెంచరానివాఁడవు