పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

303 అడలి వారితో మూఁట లందుదాఁకాను నడుమ నవ్వులెల్లాను నవ్వేవు యీవేళను వుడివోనియట్టి కాఁగి లోరెనరుదాఁకాను చ. పోరచి వనితమారు పొదిగేవు నన్ను నిట్టే చేరి యూపె నిన్నుఁ గూడి చెలఁగుదాఁకా యీరీతి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి కోరికె లన్నియునుఁ జేకూరుదాఁకాను రేకు:0086-04 రామక్రియ సంపుటము: 01-420 పల్లవి: ఎంతవిచారించుకొన్నా నిదియే తత్వము హరి వంతుకు నీకృపగలవాఁడే యెఱుఁగు హరి చ. నిన్ను నమ్మినట్టివాఁడు నిఖిలవంద్యుఁడు హరి నిన్నునొల్లనట్టివాఁడు నీరసాధముఁడు హరి మున్ను దేవతలు నీకు మొక్కి బదికిరి హరి వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి చ. యేపున నీపేరిటివాఁడిన్నిటా ధన్యుఁడు హరి నీపెరొల్లనివాఁడు నిర్భాగ్యుఁడే హరి కేపుల నిన్నుఁ నుతించి గెలిచె నారదుఁడు హరి పైపై నిన్ను దిట్టి శిశుపాలుఁడు వీఁగెను హరి చ. యిట్టె నీవిచ్చినవర మెన్నఁడు జెడదు హరి గట్టిగా నీవియ్యనివి కపటములే హరి అట్టె శ్రీవేంకటేశ నీ వంతరంగుఁడవు హరి వుట్టిపడి కానకున్న వొచ్చము దేహికి హరి రేకు:0011–05 కన్నడగౌళ సంపుటము: 01-071 పల్లవి: ఎంతసేసినా నెడయకే పోయ ముంతలోనినీట మునిఁగిలేచుట చ. ఉట్టిపై చెరలాట మూరఁబొత్తులకూడు పట్టుచాలనికొమ్ము బహునాయకము వెట్టిమోపరిలాగు వెట్టివోయినపోక నట్టింటివైరంబు నగుఁబాటుబ్రదుకు చ. రాకపోకలచేత రాఁగిన పెను(బుండు వాకులేనివరము వలవనివలుపు యేకాలము వేంకటేశునికృపలేక ఆకడీకడ నడయాడెడినడపు రేకు:0012-05 దేసాక్షి సంపుటము: 01-076 పల్లవి: ఎంతైన దొలఁగవై తేదైన నామతికి వింతచవిసేతుగా విషయబుద్ధి చ. ఎనసి జన్మముల నే నెట్ల నుండిన బోక వెనకఁ దిరుగుదువు గా విషయబుద్ధి అనువైనయనుభవన లనుభవించఁగఁ జేసి వెనక మఱపిOతుగా విషయబుద్ధి చ. కెఱలి కాంతలు నేనుఁ గినిసిననుఁ బొలయలుక విఱిచి కలపుదువుగా విషయబుద్ధి