పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

301 నెమ్మి రక్షింతు వనుచు నే నమ్మితి పమ్మి నా మదిలో నీ రూపము చూసినపుడే క్రమ్మరఁ బుట్ట ననుచు గక్కన నే నమ్మితి చ. యిట్టె యోగక్షేమము వహించుకొని యున్నపుడె నెట్టుకొనె నీ కృపని నే నమ్మితి గట్టి శ్రీవేంకటేశ లోకదృష్టాంతమైనపుడే వొట్టి సకలకర్మము లూడెనని నమ్మితి రేకు:0167-01 భైరవి సంపుటము: 02-322 పల్లవి: ఎంతపుణ్యమో యిటు మాకుఁ గలిగె చెంతనే నీకృప సిద్ధించఁబోలు చ. శ్రీపతి మీకథ చెవులను వింటిమి పాపము లణఁగెను భయ ముడిగె తీపుగఁ దులసితీర్థము &შტტჭ8)ა శాపము దీరెను సఫలంబాయ చ. గోవింద మిముఁ గనుఁగొంటి మిప్పడే పావనమైతిమి బ్రతికితిమి తావుల మీపాదములకు మొక్కితి వేవేలుఁ గలిగెను వేడుకలాయ చ. శ్రీవేంకటేశ్వర సేవించితి మిము దావత్రి వీరెను తనిసితిమి వావిరి ముమ్మారు వలగొని వచ్చితి నీవారమైతివి నిలిచితి మిపుడు పె.అ.రేకు: 0065–06 లలిత సంపుటము: 15-393 పల్లవి: ఎంతప్రతాపమో నిధి యెంచి చూచితే వింతలేల నిన్ను సేవించు టింతె కాక చ. ముప్పిరి నీ సంకల్పము ముంచి బ్రహ్మేంద్రాదులైన తప్పించలేరు మఱి దాఁటా లేరు యెప్పుడైనా దైత్యులపై యెత్తిన నీ చే చక్రము తిప్పలేరు నీ మహిమ తెలియా లేరు చ. అముక నీవు మన్నించే నంటే ననాది కర్మాలు యేమిటా మానుప లేవు యిప్పించా లేవు నేమించక లోకాలపై నీవు పరాకై వుండితే ప్రేమం బెడరేఁచలేవు పెనఁగా లేవు చ. చేరి నీవు మమ్మేలితే చేసిన యపరాధాలు మారుకొన లేవు మఱి మలయా లేవు గారవాన నలమేల్మంగపతి శ్రీవేంకటేశ యీ రీతి నీవే కాక యితరులు లేరూ రేకు: 0033-03 ముఖారి సంపుటము: 01-204 పల్లవి: ఎంతమానుమన్నఁ జింతలేల మానునే పంతపుమనసు హరిపై నుంటేఁగాక చ. తీరని బంధాలు నేఁడే తెగుమంటే నేల తెగు భారపు మమతఁ బెడఁబాసినఁగాక వూరటగా మమత నేనొల్లనంటే నేల మాను వోరువుతో లంపటము లొల్లకుంటేఁగాక చ. వేఁకపుఁగోపము నేఁడే విడుమంటే నేల విడు