పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

300 సతి నమ్ముకొన హరిశ్చంద్రుఁ జేసె కుతిలపడ శూద్రకుని గొట్టెముచ్చుగఁ జేసె మతిమాలి కురురాజు మడుఁగు చొరఁ జేసె చ. పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోఁజేసె తొడరి కాలునికాలు దునియఁ జేసె ఆడర నీవిధికి విధియగు వేంకటేశుకృప పడయకుండఁగ భంగపడకపోరాదు పె.అ.రేకు:0005-04 శుద్ధవసంతం సంపుటము: 15-029 పల్లవి: ఎంతపరమబంధుఁడవు యేమని నుతింతు మిమ్ము అంత నిన్ను మఱచి నే నపరాధి నైతిని చ. దురితములే నేఁజేసి దు(ఖముఁబొందేనాఁడు తొరలి నన్ను రోసి తొలఁగ వైతి నరకము చోచ్చేనాఁడు నాకు నంతర్యామివై పరుఁడు వీఁడేల యని పాయవైతివిగా చ. జనని గర్భమునందు చరిఁ బడి వుండేనాఁడు వెనుబలమవై నన్ను విడువ వైతి పెనఁగి పంచేంద్రియాల పిరువీఁకుల య్యెనాఁడు అనుభవింపఁగఁ జేసి అందుకు లోనైతివి చ. యెట్టు నేఁగోరిన అది యిచ్చి పరతంత్రుఁడవై మెట్టుకొని నా యిచ్చలో మెలఁగితివి యిట్టి యీ జన్మమున నన్నేలి శ్రీవేంకటేశ పట్టి నీ దాసులలోఁ దప్పక మన్నించితివి రేకు: 0030-05 బైరవి సంపుటము: 01-186 పల్లవి: ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ వింతవారితోడిపొందు వేసటాయ దైవమా చ. చూడఁజూడఁ గొత్తలాయ చుట్టమొకఁడు లేఁడాయ వీడుఁబట్టు ఆలుచాయ వేడుక లుడివోయను జోడు జోడు గూడదాయ చొక్కుఁదనము మానదాయ యేడకేడ తలపోఁత యెంతసేసె దైవమా చ. నీరులేనియేలు దాఁటనేర దెంతేలోఁత్రాయ మేరవెళ్ల నీఁదఁడాయ మేఁటిఁ జేరఁడాయను తోరమైన ఆస లుబ్బితోవ గానిపించదాయ కోరి రాకపోకచేత కొల్లఁబోయఁ గాలము చ. తల్లిదండ్రి దాత గురువు తానెంమైననాచారి వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు మొల్ల మాయ నామనసు మోదమాయ దైవమా పె.అ.రేకు:0054-05 సామంతంసంపుటము: 15-315 పల్లవి: ఎంతపుణ్యమో నీకు హీనుని రక్షించితివి యింత సేసితివి భాగ్యమేమి చెప్పీ నింకను చ. సరుగ నానోర నీవు సంకీర్తన విన్నపుడే ఆరసి మోక్ష మిత్తువని నే నమ్మితి పరుల బంటుఁగా జేయక యప్పటి నన్నేలి నపుడే నరకమందుఁ బెట్టవు నమ్మితి నేను చ. కిమ్మల నిఁక విన నీ కీర్తి గట్టినపుడె