పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

299 చ. శరణంటే విభీషణుని రామరామ చయ్యనఁ గాచితివట రామరామ బిరుదులరావణుని రామరామ పీఁచమడఁచితివట రామరామ ధరలోఁ జక్రవాళము రామరామ దాఁటి వచ్చితివఁట రామరామ సురలు నుతించిరట రామరామ నీచొప్ప యిక నదియెంతో రామరామ చ. సౌమిత్రి భరతులు రామరామ శత్రుఘ్నులుఁ దమ్ములట రామరామ నీ మహత్త్వము రామరామ నిండె జగములెల్లా రామరామ శ్రీమంతుఁడ వన్నిటాను రామరామ శ్రీవేంకటగిరిమీఁది రామరామ కామితఫలదుఁడవు రామరామ కౌసల్యానందనుఁడవు రామరామ రేకు: 0386-04 బౌళి సంపుటము: 04-501 పల్లవి: ఎంతని పొగడవచ్చు నితని ప్రతాపము పంతము లెల్లా మెరసి ప్రతాపించీ వాఁడే చ. చేతులనే పెరికి సంజీవి కొండ దెచ్చినాఁడు ఆతఁడువో తొల్లి పెద్ద హనుమంతుఁడు ఘాతలఁ దానొక్కఁడే లంక సాధించి వార్ధి దాఁటి యీతలకి వచ్చినాఁడు ఇదివో వాఁడే చ. ముదమున బ్రహ్మ లోకము దాఁకాఁ బెరిగినాఁడు అదివో ఇప్పుడు పెద్ద హనుమంతుఁడు వదలక తోఁక చక్రవాళ పర్వతము వెంటా వుదుటునఁ జుట్టుకొని వున్నాఁడు వాఁడే చ. మెల్లనే జంగ చాఁచి మెడ నిక్కించుకొన్నాఁడు అల్లదివో మించే పెద్ద హనుమంతుఁడు వెల్లవిరైనాఁడు శ్రీ వేంకటేశ్వరుని బంటై చల్లఁగా లోకములేలీ సంతతము వాఁడే రేకు: 0387-03 మాళవిగౌళ సంపుటము: 04-506 పల్లవి: ఎంతని పొగడవచ్చు నీతని సేవించరో పొంతనిదే కలశాపుర హనుమంతుఁడు చ. పిడికిటఁ బట్టినవి పెద్దపండుల గొలలు అడలి యెత్తినది మహావాలము గుడిగొన రాకాసులఁ గొట్టినది వలకేలు పొడచూపీఁ గలశాపుర హనుమంతుఁడు చ. సందడి సమరానకు చాఁచినది పెనుజంగ అందముగ నిక్కించినదదే వురము కుందక వీర రసమే కురిసేటిది మొగము పారిందగువాఁడు కలశాపుర హనుమంతుఁడు చ. వుదుటన మెలఁగేవి వొద్దికైన పాదాలు త్రిదశుల మెప్పించేది దివ్యరూపము అదె శ్రీ వేంకటేశు బంటయి నిలుచున్నాఁడు వొదలుచుఁ గళశాపుర హనుమంతుఁడు రేకు:0022-04 ముఖారి సంపుటము: 01-134 పల్లవి: ఎంతనేయఁగలేదు యిటువంటివిధి యభవునంతవానిని భిక్షమడుగు కొనఁ జేసె చ. కోరి చంద్రునిఁ బట్టి గురుతల్పగునిఁ జేసె కూరిమలరఁగ నింద్రుఁ గోడిఁ జేసె ఘనోరకుడువఁగఁ ద్రిశంకుని నంత్యజునిఁ జేసె వీరుఁడగునలుఁ బట్టి విద్రూపుఁ జేసె చ. అతివ నొడుగఁ జూదమాడ ధర్మజుఁ జేసె