పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

298 చ. పాపపుంజములచేఁ బట్టువడఁగాఁగదా ఆపదల తోడిదేహము మోవవలనె చూపులకులోనైన సుఖము గానక కదా దీపనభ్రాంతిచేఁ దిరిగాడవలనె చ. హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువకకదా పత్రిలేని నరకకూపమునఁ బడవలనె అతనికరుణారసంబబ్బ కుండఁగఁగదా బత్రిమూలి నలుగడలఁ బూరాడవలనె పె.అ.రేకు:0072-02 లలితసంపుటము: 15-412 పల్లవి: ఎంతటివాఁడవు నిన్ను నేమని నుతింతును చింతలు నీ కమరకుండఁగా విచారించే నేను చ. పాలసముద్రములోనఁ బవళించివుండే నీకు బాలుఁడవైతేనే వెన్న బాఁతాయెనా కాలమెల్లను శ్రీకాంత కౌఁగిటనుండే నీకు గోలవైతే గొల్లెతలఁ గడ వేడు కాయెనా చ. పరమపదమునందు బ్రహ్మమై వుండే నీకు పెరిగి రేపల్లె నాడఁ బ్రియమాయెనా సురల నెల్లాఁ గావ సులభుండవైన నీకు గరిమెతోడఁ బసులఁ గాన వేడు కాయెనా చ. యేపొద్దు నిత్యముక్తుల నెనసివుండే నీకు గోపాలులతోఁ గూడుండC గోల కాయెనా బాపురే యలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర యేపొద్దు ನಿಲ್ಲೆ లీలలె యితవాయెనా రేకు:0005-03 గుండక్రియ సంపుటము: 01-032 పల్లవి: ఎంతటివారలు నెవ్వరును హరిఁ జింతిచక నిశ్చింతులు గారు చ. అతిజితేంద్రియులు ననశనవ్రతులు నతుల త్రపారీధనులగువారు చతురానన గురుస్మరణము దొరకక తతి నూరక పుణ్యతములుగారు చ. అనఘులు శాంతులు నధ్యాత్మతతులు ననుపమ పుణ్యులు యాజకులు వనజోదరు ననవరతముఁ దలఁచక వినుతి స్మృతికిని విభుదులుగారు చ. దురిత విదూరులు దుర్మతిహీనులు నిరతానందులు నిత్యులును తిరువేంకటగిరిదేవుని గొలువక పరమార్గమునకు బ్రహ్మలు గారు రేకు: 0383-04 దేవగాంధారి సంపుటము: 04-485 పల్లవి: ఎంతని నుతియింతు రామరామ యిట్టినీ ప్రతాపము రామరామ పంతాన సముద్రము రామరామ బంధించవచ్చునా రామరామ చ. బలుసంజీవనికొండ రామరామ బంటుచేఁ దెప్పించితివి రామరామ కొలఁదిలేనివాలిని రామరామ ఒక్కకోల నేసితివట రామరామ వెలయ నెక్కువెట్టి రామరామ హరువిల్లు విరిచితివట రామరామ పెలుచు భూమిజను రామరామ పెండాడితివట రామరామ