పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

297 చ. శరపరంపరల శిరములు నఱకఁగ యెరగొని రావణుఁ డేమనెనో పరియలు వారంగ బ్రహ్మాండభాండము ఉరుశంఖరవం బోర్చుట యెట్లో చ. గాCటపు నిషురగదాహతికి మధు కైటభుల తలల కత లెట్లో యీటున శ్రీవేంకటేశ నీకృపను పాటించి దాసులు బ్రదుకుట యెట్లో పె.అ.రేకు: 0049-01 దేవగాంధారి సంపుటము: 15-275 పల్లవి: ఎంతగాలంబైనఁ దప్పదు యెవ్వరికి నేమనఁగ వచ్చును దొంతికడవలోని కొలుచులు తొలుత పుణ్యములు చ. కలిమి గలదని వుబ్బ వలవదు కడఁగి లేదని సగ్గ వలవదు కలసి కలలోఁ గన్న సుఖదుఃఖముల చందములు వలనుగా రాట్నంపు గుండ్రలవరుస లీ జన్మంబు లెల్లను చెలఁగి దైవము మున్నె సృష్టించినది యీ విధము చ. నేరనని దైన్యం బదేటికి నేర్తు నని గర్వం బదేటికి నారుకొను వడగండ్లగుళ్లవి నమ్మనే రాదు కోరి మనసునఁ బాలు దాగినగుఱుతు లీ భోగంబు లెల్లను వారివారికి నాత్మగుణములు వసుధ నిలిచినవి చ. పెద్దదొర నని మీఱఁదగదు పేద నని తా దాఁగఁదగదు పొద్దువొద్దును చంద్రబింబముపోల్కి వెలసినది అద్దుకొని శ్రీవేంకటేశ్వరుఁ డన్నిటికిఁ దను నేలి కావఁగ బుద్ధి యెఱుఁగుచు లోకపూజ్యతఁ బొసంగుటే శుభము రేకు:0215–02 దేవగాంధారి సంపుటము: 03–086 పల్లవి: ఎంతగాలమునకైనా యీ యర్థమే కలది యింతటిలోననే హరి నెరఁగఁగవలయు చ. యెంచి నూరేండ్లమీఁద యెప్పుడో మరణము ముంచి యిట్టే మోచీనదె మురికిడోక్క యించుకంత యిందుకుఁ గానేల కోరెమో సుఖము కాంచన మెవ్వరికిఁగా గడియించేమో చ. కలిగిన దినములు కాఁపురానకే సెలవు తలఁపెల్ల నాసలకంతటఁ గొలఁది (?) ఫల మిందు నేమిగదొ ప్రాణి ఇందేమిటివాఁడో తెలిసి పాపఁగలేము తీరని యీ చిక్కు చ. సేసిన కర్మము లెల్లా చెప్పరాని మోపులాయ రాసికెక్కి యింద్రియాల పరమాయను వేసరి యిన్నిటికి శ్రీవేంకటేశుఁ గొలిచితి మాసినదే మణుఁగాయ మాకు నేది జన్మము రేకు:0062-01 శ్రీరాగం సంపుటము: 01-316 పల్లవి: ఎంతగాలమొకదా యీ దేహధారణము చింతాపరంపరలఁ జిక్కువడవలనె చ. పడిగొన్న మోహంబువలలఁ దగులైకదా కడలేని గర్భనరకము లీఁదవలనె నడిమిసుఖములచేత ననుపు సేయఁగఁగదా తొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలనె