పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

296 చ. ఘనమైన గృహములు గట్టుకొనుటెల్లాను తనువు మోచేయంతటికే కా తనివోని మతిలోని తలపాశీఁత లెల్లాను యెనసిన బదుకు తా నెంచుటకే కా చ. యింతలోని పనియని యెరఁగని చేతఁలెల్లా సంతకూటముల యూసంసారానకా చెంతల శ్రీవేంకటేశ చేరి నీకే శరణంటే యింతక మున్నిటినేర మేమనేవో కా రేకు:0155-06 దేసాక్షి సంపుటము:02-262 పల్లవి: ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా వింతలై న నీమూర్తి వెసఁ దెలిసేమా చ. లోకములో సముద్రములోఁతు చెప్పఁగరాదట ఆకాశ మింత్రంత్రని యనరాదట మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట శ్రీకాంతుఁడ నీమహిమ చెప్ప చూపవశమా చ. అల గాలి దెచ్చి ముడియగాఁ గట్టఁగరాదట వెలయఁ గాలము గంటు వేయరాదట కలయ నలుదిక్కులకడ గానఁగరాదట జలజాక్ష నీరూపు తలపాశీయఁగలనా చ. కేవలమైన నీమాయ గెలువనేరాదట భావించి మనసు జక్కఁ బట్టరాదట దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కొల్వవశమా రేకు:0165-04 నాదరామక్రియ సంపుటము: 02-315 పల్లవి: ఎంతకత నడిపితి వేమి జోలిఁ బెట్టితివి చింతించ లోకములు నీచేతివే కావా చ. కౌరవులఁ బాండవుల కలహము వెట్టనేల నేరచి సారథ్యము నెఱపనేలా కోరి భూభార మణఁచేకొరకై తే నీచే చక్రమూరకే వేసితే దుషు లొక్కమాటే తెగరా చ. చేకొని వానరులఁగాఁ జేయనేల దేవతల జోకతో లంకాపురి చుట్టుకోనేల కాకాసురు వేసిన కసవే రావణుమీఁదనాకడఁ జంపువెట్టితే నప్పుడే సమయCడా చ. గక్కన శ్రీవేంకటేశ కంబములో వెళ్లనేల చొక్కముగాఁ బ్రహ్లాదుఁడు చూపఁగనేల చిక్కక హిరణ్యకశిపునాత్మలో నుండక తక్కించి నీవెడసితే తానే పొలియండా రేకు:0195-06 శంకరాభరణం సంపుటము: 02-491 పల్లవి: ఎంతకెంత యిది యేమని పొగడుట యింత సేయ నీకు నెదురా వీరు చ. పిడుగులఁ బోలెడి పెను నీ నఖములఁ కెడయక హిరణ్యుఁ డెట్లుండెనో వుడికెటి చక్రాయుధము వేఁడికిని జడియక మకరెటు వహించెనో