పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

295 చ. భోగించ బుట్టిన భూతకోట్లను యేగతి మోఁచీ నీశ్వరుఁడు చేగదేర తనసేవకుఁ జొచ్చినయోగము సులభం బొకటిరెకటికిని చ. పన్నిన జగములు ప్రాణాధారము యెన్నిట నున్నాఁ డీశ్వరుఁడు కన్నుల శ్రీవేంకటపతియని కని వున్నవేళ తమ వునికే సుఖము రేకు:0264-03 ముఖారి సంపుటము: 03-369 పల్లవి: ఎంత విచారించుకొన్నా నిదియే తత్త్వము హరి వంతుకు నీకృపగలవాఁడే యెరుఁగు హరి చ. నిన్ను నమ్మినట్టివాఁడు నిఖిలవంద్యుఁడు హరి నిన్ను నొల్లనట్టివాఁడు నీరసాధముఁడు హరి మున్ను దేవతలు నీకు మైుక్కి బ్రదికిరి హరి వున్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి చ. యేపున నీ పేరిటివాఁ డిన్నిటా ధన్యుఁడు హరి నీ పేరొల్లనివాఁడు నిర్భాగ్యుఁడు హరి కేపుల నిన్నునుతించి గెలిచె నారదుఁడు హరి పైపై నిన్నుఁదిట్టి శిశుపాలుఁడు వీఁగెను హరి చ. యిట్టే నీవిచ్చిన వరమెన్నఁడుఁ జెడదు హరి గట్టిగ నీవియ్యనివి కపటములే హరి అట్టె శ్రీవేంకటేశుఁడ వంతరంగుఁడవు హరి వుట్టివడి కానకున్న వొచ్చెము దేహికి హరి రేకు:0029-06 ధన్నాశి సంపుటము: 01-181 పల్లవి: ఎంత విభవము గలిగె నంతయును నాపదని చింతించినది గదా చెడనిజీవనము చ. చలముఁ గోపంబుఁ దనుఁ జంపేటిపగతులని తెలిసినది యులిగడా తెలివి తలకొన్నపరనింద తనపాలి మృత్యువని తొలఁగినది యదిగదా తుదగన్నఫలము చ. మెఱయు విషయములే తనమెడనున్నవురులుగా యెఱిఁగినది యదిగదా యెరుక పఱివోనియూస దనుఁ బట్టుకొను భూతమని వెఱచినది యుదిగదా విజ్ఞానమహిమ చ. యెనలేని తిరువేంకటేశుఁడే దైవమని వినఁగలిగినదిగదా వినికి అనయంబు నతని సేవానందపరులయి మనఁగలిగినదిగదా మనుజులకు మనికి రేకు: 0358-06 బౌళి సంపుటము:04-344 పల్లవి: ఎంత వెట్టిఁ గొండదవ్వి యెలుకఁ బట్టెద నేను పంతపు శ్రీహరి నాభ్రమ వాపవే చ. పడనిపాట్లఁ బెక్కుపనులఁ దిరుగుటెల్ల కుడిచేపట్టెఁడు గూటికొరకింతే కా కడదాఁకాఁ జెలులతోఁగాఁపురము సేయుటెల్ల వొడలు మరచియుండే వొక్క నిమిషానికా