పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

294 అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు చ. సరి నెన్నుదురు(???) శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానావిధులను తలఁపుల కొలఁదుల భజింతురు సిరుల మిమ్మనే యల్పబుద్ధిఁ దలచినవారికి నల్పంబవుదువు గరిమల మిమునే ఘనమని తలఁచిన ఘనబుద్దులకు ఘనుఁడవు చ. నీవలనఁ గొరతే లేదు మరి నీరుకొలఁది తామెరవు ఆవల భాగీరథి దరిబావుల ఆజలమే వూరినయట్లు శ్రీవేంకటపతి నీవైతే మముఁ జేకొనివున్న దైవమని యీవల నే నీ శరణనియెదను యిదియే పరతత్త్వము నాకు పె.అ.రేకు:0026-04 పాడి సంపుటము: 15-150 పల్లవి: ఎంత లేదు లోకము యొచ్చేది కుందేది పంతపు శ్రీహరిభక్తి పట్టవలెఁగాక చ. తనువులు మోచేది ధనములు దాఁచేది ఘనజీవులకు నెల్లఁ గలిగినది మనసులు రోసేది మమతలఁ బాసేది వనజాక్షుఁ గొలిచేది వలె నింతె కాక చ. కాఁపురాలు సేసేది కపటాల లాసేది తాపపు జీవుల కెల్లాఁ దగిలినదె కోపములఁ దుంచేది కోరికలఁ దెంచేది శ్రీపతి కరుణలోనఁ జిక్కవలెఁగాక చ. ఆఁకటికి బడలేది అన్నములు గొనియేది తేఁకువ జీవుల కెల్ల బ్రిష్టమైనదె యేఁకటతో శ్రీవేంకటేశ్వరు శరణని కాఁకదేర సుఖియుంచఁగా వలెఁగాక రేకు: 0160-04 సామంతం సంపుటము: 02-290 పల్లవి: ఎంత వలచితివయ్యా యింతికి చెంతనుంటే లేఁతనవ్వే నేసపాలుగావా చ. చెలి నీపైఁ జిగురాకు చిదిమివేసితేను వలరాజడిదమని వంచించితివి వెలయఁగ విరహపువేళ వాఁడెక్కుఁగాక మెలుపునఁగదిసితే మెత్తనేకాదా చ. బిసరుహాక్షి పుప్పొడి ప్రేమ నీపైఁ జల్లితేను వసంతుని చొక్కనుచు వసివాడేవు వెసఁ దెరమరఁగైతే వేగమే నామెక్కుఁగాక రసికత నొద్దనుంటే రజమే కాదా చ. అలమేలుమంగ సురటట్టే నీపై విసరితే మలయానిలు వేఁడంటా మాటువెట్టేవు తలఁచి శ్రీవేంకటేశ దవ్వెతే వేఁడెక్కుఁగాక చలపట్టి కూడితివి చల్లెనేకాదా రేకు:0116-05 శ్రీరాగం సంపుటము: 02-095 పల్లవి: ఎంత వాటువడె నీశ్వరుఁడు జంతువుల కేది సతమోకాని చ. వోముచు లోలో నొకదేహమునకె యేమి రచించెను యీశ్వరుఁడు కామించి మోక్షసుఖమునకునైతే వోమిన ప్రిషులు వొకటీఁగావు